Janasena: జనసేన అధినేత పవన్ తో పాటు ఆ పార్టీ నుంచి మంత్రులుగా ఎంపికైన నాందెండ్ల మనోహర్ కందుల దుర్గేష్‌లకు కేటాయించిన శాఖలను పేర్కొంటూ ఓ పోస్టర్లను సిద్ధం చేసింది జనసేన. దీనిపై తమ తమ అభిప్రాయాలను, సలహాలను సూచనలను ఇవ్వాలని ప్రజలను కోరింది. పార్టీ కి చెందిన ఫేస్‌బుక్ పేజీలో  ఈ  పోస్టర్ ని పోస్టు చేసింది. 


పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ, గ్రామీణ నీటి సరఫరా, పర్యావరణం, అటవీ శాఖ, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ, పౌరసరఫరాల శాఖ, పర్యాటకం శాఖ, సినిమాటోగ్రఫీ శాఖ లకు జనసేన అధినేత పవన్ తో పాటు, నాయకులు మనోహర్, దుర్గేష్ మంత్రులుగా ఉన్న నేపథ్యంలో ఆయా శాఖలకు సంబంధించి ప్రజలే తగు  సూచనలు సలహాలు ఇవ్వాలని జనసేన కోరింది.  దీనికోసం ప్రత్యేకంగా ఓ ప్రకటన తయారు చేసి తన అధికారిక ఫేస్ బుక్ ఖాతాలో పోస్టు చేసింది. సూచనలిచ్చేందుకు ఆసక్తి ఉన్నవారు నేవిగేట్ చేసేందుకు ఓ వెబ్ లింక్‌ని ఆ పోస్టర్ లో ప్రొవైడ్ చేసింది. దీంతో పాటు ఓ క్యూ ఆర్ కోడ్ సైతం కనిపిస్తోంది. 


ఈ లింక్ ఓపెన్ చేస్తే.. పేరు, మొబైల్ నెంబరు, మీరు ఏ ఏ శాఖలపై సూచనలు ఇవ్వదలుచుకున్నారో ఆ శాఖల ఎంపిక, మీ జిల్లా, నియోజకవర్గం ఎంటర్ చేయాలి. అవన్నీ ఎంటర్ చేసి లోపలకి వెళ్లగానే మీ జెండర్, మీ వయసు, మీ మండలం, మీ గ్రామం, పంచాయతీ, వార్డు, ఈ మెయిల్ ఐడీ విద్యార్హత, వృత్తి వంటి వివరాలు అడుగుతుంది. అవన్నీఎంటర్ చేశాక కింద మీరు చెప్పాలనుకున్న సూచనలు, సలహాలపై వివరించేందుకు ఓ సెక్షన్ ఉంటుంది. అదంతా ఫిల్ చేవాక.. మీరు చెప్పలనుకున్న సమస్య లేదా ఇవ్వాలనుకున్న సూచనలకు సంబంధించిన ఫైల్ ని అప్ లోడ్ చేయమని చూపిస్తుంది. అయితే ఇది అప్షనల్. అప్ లోడ్ చేయకపోయినా ఏమీ కాదు. అంతా అయిపోయాక సబ్మిట్ అని కొడితే మీ సూచన జనసేన పార్టీ నమోదు చేసుకుంటుంది. 



ఇన్నేళ్ల చరిత్రలో ఏ పార్టీ తీసుకోని స్టాండ్ జనసేన తీసుకోవడం ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చకు తెరలేపింది. వారికి ఉన్న మంత్రులు ముగ్గురే అయినప్పటికీ ఆ శాఖల్లో ఉత్తమ పనితీరు ప్రదర్శించేందుకు జనాభిప్రాయ సేకరణ దిశగా పవన్, ఆయన పార్టీ నేతల ప్రయత్నాలపై సర్వత్రా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.  


మీక్కూడా జనసేన మంత్రులకు వారు నిర్వహించే శాఖలపై సలహాలు సూచనలు ఇవ్వాలని ఉందా.. అయితే వెంటనే జనసేన ఫేస్ బుక్ పేజీని సందర్శించి ఈ లింక్ ఓపెన్ చేసి మీమీ ఇన్ పుట్స్ ఇచ్చేయండి. లేదా ఈ ఆర్టికల్ లో చూపించిన చిత్రం క్యూ ఆర్ కోడ్ ని స్కాన్ చేయండి.