రాహల్ గాంధీ సభలో ప్రకటించిన "రైతు డిక్లరేషన్‌"ను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగా  రాష్ట్రవ్యాప్తంగా  రైతు రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహించాలని నిర్ణయించింది.  ఆచార్య జయశంకర్ స్వగ్రామం అక్కంపేట లో రచ్చబండ లో  టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి పాల్గొంటారు. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం నెదునూరు గ్రామంలో పాల్గొన్న సీఎల్పీ నేత భట్టి విక్రమార్క , కొమురవల్లి గ్రామంలో రచ్చబండ కార్యక్రమం లో పాల్గొననున్న పొన్నాల లక్ష్మయ్య,  హుజూర్ నగర్ లోని చింతలపాలెం మండలం బుగ్గ మాదారం గ్రామంలో ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి పాల్గొంటారు. పార్టీ ముఖ్య నేతలంతా వారి వారి నియోజకవర్గాల్లో పాల్గొంటారు.


తెలంగాణ సక్సెస్ ఇండియా సక్సెస్ - ప్రపంచమంతా చాటాల్సిన అవసరం ఉందన్న కేటీఆర్


రైతులను ఆకట్టుకునేందుకు కాంగ్రెస్ పార్టీ పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తోంది.  ఇప్పటికే రాహుల్ సమక్షంలో డిక్లరేషన్ ప్రకటించి.. అది కాగితం కాదు.. కాంగ్రెస్ పార్టీ గ్యారంటీ అని.. చెప్పించారు. ఇప్పుడు ఆ డిక్లరేషన్‌పై రైతుల్లో చర్చ పెట్టేందుకు సిద్ధమయ్యారు. మే 21న అంటే శనివారం ముఖ్య నాయకులు ఒక్కొక్క చరిత్రాత్మక గ్రామాలలో రైతు రచ్చబండ నిర్వహించాలని నిర్దేశించారు. ఆ తర్వాత 30 రోజులపాటు రాష్ట్రంలో అన్ని గ్రామాల్లో రైతు రచ్చబండ సభలు నిర్వహించనున్నారు. హైదరాబాద్, సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాలు మినహాయించి మిగతా 15 నియోజక వర్గాలలో 15 మంది ముఖ్య నాయకులను నియమించారు.


దిశ నిందితుల ఎన్ కౌంటర్ బూటకమా - కేసుపై సంచలన విషయాలు వెల్లడించిన సిర్పూర్కర్ రిపోర్ట్‌లో ఏముందంటే !
 
తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తే రైతులు పండించి అన్ని రకాల పంటలను ప్రభుత్వమే కొంటుందని ఎంపీ రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. పసుపు బోర్డు ఏర్పాటు చేసి అన్నదాతలకు అండగా ఉంటామని భరోసానిచ్చారు. పంటల బీమా పథకం అమలు చేసి నష్టపోయిన రైతులకు పరిహారం అందిస్తామని వెల్లడించారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చి వెంటనే ధరణి పోర్టల్‌ను రద్దు చేస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో పోడు భూముల్లో సాగు చేసుకుంటున్న రైతులకు పట్టాలు ఇస్తామని వెల్లడించారు. తెలంగాణలో ఉన్న పెండింగ్‌ ప్రాజెక్టులను పూర్తి సాగు నీరు అందిస్తామన్నారు. ఇలాంటి హామీలతో ఉన్న రైతు డిక్లరేషన్‌ను రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ నేతలంతా ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు.


ఒక్క రైతు డిక్లరేషన్ మాత్రమే కాదు.. ఇతర వర్గాలకు కూడా త్వరలో వరంగల్ తరహాలో సభలు పెట్టి డిక్లరేషన్లు ప్రకటిస్తామని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు