Rajagopla Reddy :   బీజేపీలో చేరాలని నిర్ణయించుకున్నట్లుగా ప్రకటనలు చేస్తున్న మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని నిర్ణయించారు. ఈ అంశంపై  కాంగ్రెస్ పార్టీ తెలంగాణ వ్యవహారాల ఇంచార్జ్ మాణిగం ఠాగూర్ ఉమ్మడి నల్లగొండ జిల్లాల నేతలతో చర్చలు జరుపుతున్నారు. ముఖ్యంగా మునుగోడు నియోజకవర్గ కాంగ్రెస్ నేతలతో మాట్లాడుతున్నారు. ఆయన ఇక పార్టీలో ఉండరని ఖరారు చేసుకున్నందున ఆయనపై చర్యలు తీసుకోవాలని నిర్ణయించుకున్నట్లుగా కనిపిస్తోంది. 


శ్రీలంక, నేపాల్‌లో క్యాసినోలు - హైదరాబాద్‌లో ఈడీ సోదాలు, ఒకేసారి 8 చోట్ల


కాంగ్రెస్‌తో అంటీ ముట్టనట్లుగా ఉంటున్న రాజగోపాల్ రెడ్డి 


కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తాను అమిత్ షాను కలిశానని పలుమార్లు ప్రకటించారు. అదే సమయంలో బీజేపీలో చేరికపైనా ప్రకటనలు చేశారు. 2018 ఎన్నికల తర్వాత నుండి ఆయన కాంగ్రెస్ పార్టీతో అంటీ ముట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. వివాదాస్పద ప్రకటనలు చేస్తున్నారు. ఓ సందర్భంలో బీజేపీలో చేరడానికి సన్నాహాలు చేుకున్నారు. కానీ తానే తెలంగాణలో బీజేపీ తరపున సీఎం అభ్యర్థినని చెప్పుకుంటున్న ఆడియోలు వైరల్ కావడంతో .. తర్వాత పరిణామాలు మారిపోయాయి. ఆయన ఆగిపోయారు. అయితే ఇటీవల ఉపఎన్నికల వ్యూహంలో ఉన్న బీజేపీ ఆయనను చేర్చుకోవాలని నిర్ణియించుకున్నట్లుగా తెలుస్తోంది. 


కేసీఆర్ ఢిల్లీలో ఏం చేస్తున్నారు ? అప్పులపైనే చర్చలా ?


ఉపఎన్నికల వ్యూహంలో బీజేపీ 


బీజేపీలో చేరాలని నిర్ణయించుకున్న రాజగోపాల్ రెడ్డి ఇంటికి బండి సంజయ్, ఈటల రాజేందర్ వంటి కీలక నేతలు వెళ్లి సంప్రదింపులు జరిపారు. అందరూ కలిసి రెండు మూడు రోజుల్లో ఢిల్లీ వెళ్లే అవకాశం ఉంది. అక్కడ చర్చలు ఫలిస్తే వెంటనే కోమటిరెడ్డి తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారని అంచనా. అదే జరిగితే కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందికరం అవుతుంది. అందుకే ముందుగానే సస్పెన్షన్ వేటు వేయాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. 


నెటిజెన్ల ట్రోల్స్ - "వర్క్ ఫ్రమ్ హోం" ఫొటోతో మంత్రి కేటీఆర్ రియాక్షన్ !




కాంగ్రెస్‌కు మిగిలేది ఐదుగురు ఎమ్మెల్యేలే



కాంగ్రెస్ పార్టీ తరపున 2018 ఎన్నికల్లో 19 మంది ఎమ్మెల్యేలు గెలిచినప్పటికీ తర్వాత వారిలో 13 మంది టీఆర్ఎస్‌లో చేరిపోయారు. దీంతో ఇప్పుడు ఆ పార్టీకి ఆరుగురు మాత్రమే ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇప్పుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా రాజీనామా చేస్తే ఆ బలం ఐదుగుకు తగ్గుతుంది. మరో ఎమ్మెల్యే  జగ్గారెడ్డి కూడా తరచూ కాంగ్రెస్ పార్టీ తీరుపై విమర్శలు చేస్తూ ఉంటారు.