Minister KTR: కరోనా సమయంలో చాలా మంది ఉద్యోగులు వర్క్ ఫ్రం హోం ఆప్షన్ ద్వారా ఇంటి నుంచే తమ విధులు నిర్వర్తించారు. అలాగే మన ప్రజా ప్రతినిధి,  రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ వర్క్ ఫ్రం హోం విధఆనంలో విధులు నిర్వర్తిస్తున్నారు. ఇటీవలే ఆయన కిందపడడంతో చీల మండకు గాయం అయింది. వైద్యుల సూచన మేరకు మూడు వారాల పాటు విశ్రాంతిలో ఉండబోతున్నారు. ఈ క్రమంలోనే మంత్రి కేటీఆర్ ఖాళీగా ఉండకుండా ఆయన వర్క్ ఫ్రం హోం విధఆనం ద్వారా  ఇంటి నుంచే విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ విషయాన్ని కేటీఆర్ యే స్వయంగా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. తాను ఇంచి నుంచి పని చేస్తున్నానని చెప్తూ.. కొన్ని దస్త్రాలు చేతుల్లోకి తీసుకొని పరిశీలిస్తున్న ఫొటోను షేర్ చేశారు. 


సినిమాలు ఎందుకు.. పని చేయొచ్చుగా..!


రెండు రోజుల క్రితం మంత్రి కేటీఆర్ కాలికి ప్రమాద వశాత్తు గాయం అయింది. ఈ క్రమంలో వైద్యులు ఆయనకు మూడు వారాల విశ్రాంతి సూచించారు. ఈ విషయాన్ని ఆయన సామాజిక మాధ్యమాన ద్వారా తన అభిమానులతో పంచుకున్నారు. తన జన్మ దినానికి ముందు రోజునే ఇలా జరగడంతో.. చాలా మంది అభిమానులు తీవ్రంగా బాధ పడ్డాురు. అయితే విశ్రాంతి సమయంలో చూసేందుకు ఓటీటీలో ఏవైనా మంచి కార్యక్రమాలు, సినిమాలు సూచించాలని తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా కోరారు. అయితే ఇది చాసిని చాలా మంది ఒక్కోలా స్పందించారు. కొందరు మంచి మంచి సినిమాలు, షోల పేర్లు చెప్పగా... మరి కొందరేమో నెగటివ్ ట్రోల్స్ చేయడం ప్రారంభించారు.


ప్రతిపక్ష నాయకుల తీవ్ర ఆరోపణలు..


సినిమాలు ఎందుకు సార్.... ఇంటి దగ్గరే ఉండి వర్క్ ఫ్రం హోం చేయొచ్చుగా అని కొందరు, సినిమాలు చూసి టైం ఎందుకు వేస్ట్ చేస్కుంటారని మరికొందరు కామెంట్లు చేశారు. ప్రతి పక్షాలు అయితే ఈ విషయాన్ని తీవ్ర స్థాయిలో విమర్శించారు. ఎంపీ ధర్మపురి అర్వింద్ అయితే ఎక్కడో తాగి పడిపోయి.. కాలికి గాయం చేస్కున్నాడంటూ ఆరోపించాడు. ఇంట్లో కూర్ొచని ఓటీటీలో సినిమాలు చూస్తూ ఎంజాయ్ చేస్తున్నాడంటూ ఘాటు వ్యాఖ్యలు చేశాడు. రాష్ట్రమంతా వర్షాలు, వరదలతో ఇబ్బందులు పడుతుంటే ఆయన మాత్రం ఫుల్లుగా ఎంజాయ్ చేస్తున్నారంటూ ఏకి పారేశారు. దీనికి మద్దతుగా చాలా మంది నిలుస్తూ... కేటీఆర్ పై నెగటివ్ ట్రోల్స్ చేయడం ప్రారంభించారు. 



అందుకే కేటీఆర్ వర్క్ ఫ్రం హోం..!


వీటన్నిటికీ చెక్ పెట్టాలని నిర్ణయించుకున్న మంత్రి కేటీఆర్.. ఒక్క ఫొటోతో అందరి నోళ్లు మూయించారు. నేను వర్క్ ఫ్రం హోం చేస్తున్నానంటూ.. ఏవో దస్త్రాలను పరిశీలిస్తున్న ఫొటోను ట్విట్టర్ లో షేర్ చేశారు. ఇదంతా చూస్తుంటే నెటిజెన్ల నుంచి వచ్చిన నెగటివ్ ట్రోల్స్ వల్ల, నెటిజెన్ల సూచన మేరకే వర్క్ ఫ్రం హోం చేస్తున్నారని చాలా మంది భావిస్తున్నారు. మీరు త్వరగా కోలుకోవాలని కొందరు, మొన్నే సినిమాల గురించి అడగకుండా.. ఇలా పని చేస్కుంటే అయిపోయేదని మరికొందరు కామెంట్లు చేస్తున్నారు.