శ్రీరస్తు - శుభమస్తు - అవిఘ్నమస్తు
జులై 27 బుధవారం పంచాంగం


తేదీ: 27-07 -2022
వారం:  బుధవారం
శ్రీ శుభకృత్ నామ సంవత్సరం,దక్షిణాయణం, గ్రీష్మ ఋతువు,ఆషాఢ మాసం,బహుళ పక్షం
తిథి  : చతుర్ధశి బుధవారం సాయంత్రం 8.06 వరకు తదుపరి అమావాస్య
నక్షత్రం:  పునర్వసు పూర్తిగా ఉంది.. అంటే బుధవారం సూర్యోదయం నుంచి గురువారం ఉదయం 7.40 వరకు 
వర్జ్యం :  సాయంత్రం 5.44 నుంచి 7.30 వరకు 
దుర్ముహూర్తం :  ఉదయం 11.41 నుంచి 12.33 వరకు తిరిగి 10.57 నుంచి 11.42 వరకు  
అమృతఘడియలు  : రాత్రి  తెల్లవారుజాము 4.24 నుంచి సూర్యోదయం వరకు  
సూర్యోదయం: 05:40
సూర్యాస్తమయం : 06:22


( తెలుగువారు ముఖ్యంగా తిథి, నక్షత్రం, వర్జ్యం, దుర్ముహూర్తం, రాహుకాలం మాత్రమే చూసుకుని ఏదైనా పనిప్రారంభిస్తారు...మిగిలిన వాటిని పెద్దగా పరిగణలోకి తీసుకోరు. పంచాగం, ప్రాంతం ఆధారంగా సమయాల్లో స్వల్ప మార్పులుంటాయి)


Also Read: వరలక్ష్మీ వ్రతం, నాగపంచమి, రాఖీ సహా శ్రావణ శుద్ధ పాడ్యమి నుంచి శ్రావణ పౌర్ణమి వరకూ వచ్చే పండుగలు, వాటి విశిష్టతలు


మంత్రాలు కేవలం శబ్దాలు మాత్రమే కాదు..మంత్ర పఠనంతో శరీరంలో అనేక మార్పులు సంభవిస్తాయి. వీటి వల్ల తెలియని అనుభూతి కలుగుతుంది. మనలో ఉండే శక్తిని మేల్కొలిపి, ఫలితాల సాధనపై ప్రభావం చూపుతాయి. ముఖ్యంగా విద్యార్థులు కొన్ని మంత్రాలను ఉఛ్చరించడం వల్ల ఏకాగ్రత పెరుగుతుంది. మేధస్సు,జ్ఞాపకశక్తిని పెంచే పవర్ ఫుల్ సరస్వతి మంత్రాలు మీకోసం...


‘ఓం గం గణపతియే నమ:’
ఈ మంత్రాన్ని పఠిస్తే మేధస్సు, జ్ఞాపకశక్తి పెరిగుతుంది


సరస్వతి గాయత్రి మంత్రం
‘ఓం ఐం వాగ్దేవాయై విద్మహే కమరాజ్యాయ దీమహే
తన్నో దేవి ప్రచోదయాత్’
చదువు పట్ల ఏకాగ్రత సాధించడానికి ఈ మంత్రాన్ని ఉచ్చరిస్తే ఫలితం ఉంటుంది.


‘శ్రీం హ్రీం సర్వస్వత్యాయ స్వాహ
ఐం హ్రీం, ఐంగ్ హ్రీం సరస్వత్యాయ నమ:’ 
ఈ మంత్రాన్ని రోజుకు 11 సార్లు జపిస్తే తెలివితేటలు వృద్ధి చెందుతాయి


సరస్వతి బీజ మంత్రం
‘ఐంగ్ ఓం ఐంగ్ నమ:, ఐం ఐంగ్ క్లీం సౌహ’


Also Read: వరలక్ష్మీ వ్రతం ఎప్పుడు చేసుకోవాలి!


రామచరిత మానస్ మంత్రం
‘గురు గృహ‌ గయ పధాన రఘురాయే
అల్పకాల విద్యా సబపాయే’ 
ఈ మంత్రాన్ని 21 సార్లు జపిస్తే ఉన్నత విద్య సిద్ధిస్తుంది


‘జహీ పర్ కృపా కరిన్ జాను జాని కబీ ఉర్ అజీర్ నచవ్విన్ బని
మోరి సుధాహరి సొసాబ్ భాంతి జాసు కృపా నహిన్ కృపన్ అఘాతి’
ఈ మంత్రం పఠిస్తే ఆత్మవిశ్వాసం పెరుగుతుంది


Also Read: గురుగ్రహం తిరోగమనం, నాలుగు నెలల పాటూ ఈ రాశులవారికి ధనం, కీర్తి