తెలుగుదేశం పార్టీ పదవులు తీసుకుని పార్టీలో క్రియాశీలకంగా లేని నేతలపై దృష్టి పెట్టింది. పని చేస్తారా తప్పుకుంటారా అనే విషయాన్ని తేల్చాలని అనుకుంటోంది. టీడీపీ అధినేత చంద్రబాబు, ( Chandra Babu ) ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు పన్నెండు మంది వివిధ స్థాయిల నేతలను ఆహ్వానించారు. పార్టీ తరపున చురుగ్గా లేని వారందర్నీ ఇలా పిలిచినట్లుగా టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. వీరిలో విశాఖ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ( Ganta Srinivasa Rao ) కూడా రావాలని అధిష్టానం ఆదేశించింది. 2019 ఎన్నికల తర్వాత పార్టీలో శ్రీనివాసరావు క్రియాశీలకంగా ఉండడం లేదు.
త్రిసభ్య కమిటీ తొలి భేటీలో నిరాశే ! తెలుగు రాష్ట్రాల మధ్య ఒక్క అంశంలోనూ రాని ఏకాభిప్రాయం..?
టీడీపీ (TDP ) ఓడిపోయిన తర్వాత ఆ పార్టీకి దూరంగా ఉన్న ఎమ్మెల్యేల్లో గంటా శ్రీనివాసరావు ఒకరు. ఓ సారి బీజేపీలో చేరుతారని.. మరోసారి వైఎస్ఆర్‌సీపీలో చేరుతారని ప్రచారం జరిగింది. అయితే అన్నీ ప్రచారాలుగానే మిగిలిపోయాయి. అటు ఖండించలేక.. ఇటు అంగీకరించలేక గంటా శ్రీనివాసరావు సైలెంట్‌గా ఉండిపోయారు. మధ్యలో స్టీల్ ప్లాంట్ ( Steel Plant ) ఇష్యూ వచ్చినప్పుడు రాజీనామా చేశారు. కానీ అది ఆమోదం పొందలేదు. ఆ తర్వాత ఆ ఉద్యమమూ సైలెంట్ అయిపోయింది. ఇప్పుడు మళ్లీ ఎన్నికల వేడి కనిపిస్తూండటంతో ఇటీవల గంటా శ్రీనివాసరావు టీడీపీలోనే యాక్టివ్ అవుతున్నారని ఆయన అనుచరులు చెబుతున్నారు. ఓ కార్యక్రమం సందర్భంగా తన నియోజకవర్గం మొత్తం ఇప్పుడు ఫ్లెక్సీలతో నింపేశారు. అన్నింటిలోనూ పెద్దగా చంద్రబాబు ఫోటోలు పెట్టారు. ప్రస్తుత పరిస్థితుల్ని అంచనా వేసుకుని ఇక పక్క చూపులు చూడటం దండగని టీడీపీలోనే ఉండటం మంచిదని ఆయన నిర్ణయానికి వచ్చినట్లుగా చెబుతున్నారు .
టిక్కెట్ రేట్ల జీవో భీమ్లా నాయక్‌కు ముందా ?తర్వాతా ?
పార్టీ ఆఫీసులో ( TDP Office ) చంద్రబాబుతో జరిగే సమావేశానికి ఆయన వస్తే పార్టీలో ఉన్నట్లు లేకపోతే ఆయన నియోజకవర్గానికి వేరే ఇంచార్జిని ప్రకటించే ఆలోచన చేస్తారని అంటున్నారు. ఒక వేళ గంటా శ్రీనివాసరావు టీడీపీలోనే కొనసాగాలని నిర్ణయించుకున్నా అయితే చంద్రబాబు ఆయనకు మునుపటి ప్రాధాన్యత ఇస్తారా అన్నది సందేహమేనని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. పార్టీ కోసం పని చేయని వారిని ప్రోత్సహించకూడదని చంద్రబాబు నిర్ణయించుకున్నారని అంటున్నారు. కారణం ఏదైనా గంటా మళ్లీ టీడీపీ తరపున యాక్టివ్ కాకపోతే ఆయనకు ప్రత్యామ్నాయం చూసుకోవాలని టీడీపీ హైకమాండ్ నిర్ణయించుకుంది.