ఆంధ్రప్రదేశ్‌లో టిక్కెట్ రేట్ల సవరణ జీవో ఎప్పుడు వస్తుంది ? ఐదో ఆటకు అనుమతి ఇస్తూ జీవో ఎప్పుడు ఇస్తారు ? ఇప్పడు పవన్ కల్యాణ్ " భీమ్లా నాయక్" ( Bheemla Naik ) నిర్మాతలకు టెన్షన్ పట్టుకున్న అంశం ఇది. గురువారం వరకూ భీమ్లా నాయక్ సినిమా విడుదలపై గందరగోళం కొనసాగుతూనే ఉంది. ఎందుకంటే ఓవైపు టిక్కెట్ రేట్లు మాత్రమే కాదు.. మరో వైపు యాభై శాతం ఆక్యుపెన్సీ నిబంధన కూడా ఏపీలో ఉంది. అయితే గురువారం సాయంత్రం ఆ నిబంధన కూడా తీసివేయడంతో భీమ్లా నాయక్ బృందం ధైర్యం చేసింది. ఫిబ్ర‌వ‌రి 25న విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు.  


జనసైనికులవ్వాలనుకునేవారికి బంపర్ చాన్స్ - పవన్ కల్యాణ్ కీలక ప్రకటన ఇదే !


ఈనెల 25నే వ‌స్తున్నామంటూ.. రిలీజ్ డేట్ పోస్ట‌ర్ వేశారు. దాంతో.. ఆ రోజున రావాల‌నుకున్న `గ‌ని` వాయిదా ప‌డింది. ట్రైల‌ర్ రిలీజ్ డేట్, ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్‌..  ప‌బ్లిసిటీ కార్య‌క్ర‌మాల్లో బిజీ అయిపోయింది భీమ్లా టీమ్‌. ఇప్పుడు భీమ్లా టీమ్‌కు పెద్ద టెన్షన్ టిక్కెట్ రేట్లు. టిక్కెట్ రేట్లు ( Movie Ticket Rates )  పెంచేందుకు ప్రభుత్వం అంగీకరించింది. అదే సమయంలో ఐదో షోకు అనుమతి ఇస్తామని సీఎం జగన్ చెప్పారు. అయితే అవి ఆదేశాల రూపంలో రావాలి. ఇరవై ఐదో తేదీలోపు వస్తేనే భీమ్లా నాయక్‌కు కాస్త ఊరట లభిస్తుంది.రేట్లు పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది. 


అయితే గతంలో పవన్ కల్యాణ్ ( Pavan Kalyan ) వకీల్ సాబ్ రిలీజయినప్పుడే ప్రభుత్వం టిక్కెట్ రేట్లు తగ్గిస్తూ రాత్రికి రాత్రి జీవోలు జారీ చేసింది. ఈ ప్రకారం చూస్తే భీమ్లానాయక్ సినిమా రిలీజయ్యే లోపు జీవో రావడం కష్టమన్న అభిప్రాయం ఉంది.  ప్రభుత్వం రూ. వంద కోట్ల పైబడిన బడ్జెట్ ఉన్న సినిమాలకు ప్రత్యేక ధరలు ఖరారు చేస్తుంది. కానీ భీమ్లా కు అంత బడ్జెట్ లేదు. 


క్షణమైనా టిక్కెట్ రేట్ల పెంపు జీవో - ఏపీ ప్రభుత్వం వైపు చూస్తున్న టాలీవుడ్ !


కానీ ప్రస్తుతం సింగిల్ ధియేటర్లలో ఉన్న టిక్కెట్ రేట్లను ( Ticket Rates ) మార్చకపోతే మాత్రం భారీగా కలెక్షన్లకు గండి పడుతుంది.  అయినా ప్రభుత్వం నష్టం చేయాలనుకుంటే ఎంత కాలం ఆగినా చేస్తుందని..  ఇప్పుడు రిలీజ్ చేయకపోతే తర్వాత ఇబ్బంది అవుతుందని నిర్మాత నిర్ణయించేసుకున్నట్లుగా కనిపిస్తోంది.