పార్టీని బలోపేతం చేసే దిశగా పవన్ కల్యాణ్ ( pavan Kalyan )అడుగులు ముందుకు వేస్తున్నారు. ఇప్పటికే పార్టీ బలంగా ఉందనుకున్న చోట పార్టీ వ్యవహారాలను గాడిన పెట్టడానికి ప్రత్యేకంగా కమిటీల్ని నియమించారు. సంస్థాగత నిర్మాణాన్ని ఓ కొలిక్కి తెచ్చారు. అనుబంధ కమిటీలనూ ప్రకటించారు. ఇప్పుడు పార్టీలో క్రియాశీలక సభ్యులను పెంచుకోవాలని నిర్ణయించుకున్నారు.  ఈనెల 21 నుండి జ‌న‌సే ( Janasena )  క్రియాశీల‌క స‌భ్యత్వాల మలివిడతను ప్రారంభించాలని నిర్ణయించారు. పార్టీ అధ్యక్షుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఈ మేరకు వీడియో సందేశం విడుదల చేశారు. 


 









జనసేన పార్టీ క్రమంగా బలపడుతోందని  ప్రతి నియోజ‌క‌వ‌ర్గంలో 2వేల‌మంది క్రియాశీల‌క స‌భ్య‌త్వం న‌మోదు చేసేందుకు జ‌న‌సైనికులు ప‌ని చేయాల‌ని ఆయ‌న పిలుపునిచ్చారు. ఇటీవలి కాలంలో జనసేన పార్టీ క్రియాశీలకంగా ఎలాంటి కార్యక్రమాలు చేపట్టలేదు. ఆ మధ్య రోడ్లకు శ్రమదానం చేశారు. పవన్ కల్యాణ్ కూడా పాల్గొన్నారు. ఆ తర్వాత ప్రెస్‌నోట్లకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. అయితే పూర్తి స్థాయిలో క్యాడర్ ను సిద్ధం చేసి.. సంస్థాగత నిర్మాణం పూర్తి చేసి ఆ తర్వాత రంగంలోకి దిగాలని పవన్ అనుకుంటున్నట్లుగా కనిపిస్తోంది.  


త్వరలో జనసేన వరుసగా కార్యక్రమాలు చేపట్టబోతోంది.  జనసేన పార్టీ  20న మత్స్యకార అభ్యున్నతి సభను నర్సాపురంలో ఏర్పాటు చేసింది. దీనికి పవన్ కల్యాణ్ హాజరవుతున్నారు. ఇటీవల ప్రభుత్వం చేపల చెరువులపై మత్స్యకారులకు అధికారాలు తొలగించేలా ..వారి ఉపాధిని దెబ్బతీసేలా ఉన్న జీవో 217ను విడుదల చేసింది. దానికి వ్యతిరేకంగా జనసేన ఉద్యమం చేయాలని నిర్ణయించింది. ఇప్పటికే మత్స్యకార గ్రామాల్లో ప్రచారం చేస్తున్నారు. ఫిబ్రవరి 20న సభ నిర్వహిస్తారు. పవన్ కల్యాణ్ హాజరవుతారు.  


అలాగే నారసింహ యాత్రలు ( Narasimha Tours )చేపట్టాలని నిర్ణయించారు. కొండగట్టు నుంచి మొదలు పెట్టాలని .. తెలుగు రాష్ట్రాల్లో 30 నరసింహా ఆలయాలను సందర్శించాలని నిర్ణయించారు. తెలుగు రాష్ట్రాల అభివృద్ది కాంకిస్తూ ఈ ఆలయాల యాత్ర అని పవన్ కల్యాణ్  ప్రకటించారు. మార్చి పధ్నాలుగో తేదీన జనసేన ఆవిర్భావ దినోత్సవం.  ఈ ఏడాది ఆవిర్భావసభను మంగళగిరిలో అత్యంత భారీగా నిర్వహించాలని నిర్ణయించారు కరోనా ప్రభావం పూర్తిగా తగ్గిపోవడం ఇక ఆంక్షల్లావేంటిమీ ఉండే అవకాశం లేకపోవడంతో మంగళగిరి సమీపంలోని కాజలో పెద్ద ఎత్తున సభ నిర్వహణకు ఏర్పాట్లు చేయాలని నిర్ణయించారు.