Target BRS: ఏడాది కిందట తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి పదవి బాధ్యతలు చేపట్టినప్పుడు ఇక తెలంగాణలో కక్ష సాధింపు రాజకీయాలు జగన్ పాలనలో అన్నట్లుగా ఉంటాయని అనుకున్నారు. ఎందుకంటే రేవంత్ రెడ్డి పదేళ్ల పాటు అంత ఘోరమైన నిర్బంధాలను ఎద్రుకొన్ననారు. కేసులు పాలయ్యారు. జైలుకెళ్లారు. దెబ్బకు దెబ్బ తీర్చుకుంటారని అనుకున్నారు. కానీ రేవంత్ రెడ్డి అలాంటి పనులేమీ చేయలేదు. బాత్‌రూంలో కేసీఆర్ జారి పడితే పరామర్శించి వచ్చి అందర్నీ ఆశ్చర్యపరిచారు. ఈ ఏడాది కాలంలో ఏ ఒక్క బీఆర్ఎస్ నేతపై కేసులు పడలేదు. దీంతో రేవంత్ రెడ్డికి ఏమీ దొరకలేదనో.. దొరికినా కక్షసాధింపులు అంటారనుకుని చర్యలు తీసుకోవడం లేదని ఫిక్సయిపోయారు.కానీ రేవంత్ రెడ్డి ఇలాంటి విషయాల్లో ఎడాది పాటు కూలింగ్ పీరియడ్ ను పెట్టుకున్నారు. ఏడాది అయిపోయింది.. ఇప్పుడు పంజా విసురుతున్నారని అనుకోవచ్చు.
ఏడాది కిందటే ఫార్ములా ఈ రేసు లో నిధుల గోల్ మాల్ గుట్టు
ప్రస్తుతం కేటీఆర్ పై నమోదు చేసిన ఫార్ములా ఈ రేస్ కేసు వ్యవహారంలో పూర్తి సమాచారం ప్రభుత్వం వద్ద ఏడాది కిందటే ఉంది. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత FEO సంస్థ ప్రభుత్వానికి లేఖ రాసింది. ఏర్పాటు చేయలేదని.. తమకు చెల్లించాల్సిన నిధులు ఇంకా చెల్లించాలని ఆ లేఖ సారాంశం. దాంతో ప్రభుత్వం ఈ విషయం మీద పూర్తి సమాచారం సేకరించింది. వందల కోట్లు ప్రభుత్వమే చెల్లించి వారికి సౌకర్యాలు కల్పించి రేసులు నిర్వహింప చేయాలన్న రూల్ చూసి ఆశ్చర్యపోయారు. వెంటే ఆ రేసును రద్దు చేశారు అప్పటికే రూ. 55 కోట్లు చెల్లించారు ఏ పద్దులో చెల్లించాలో చూశారు కానీ ఎక్కడా కనిపించలేదు. దాంతో ప్రభుత్వానికి మొదటి తీగ దొరికినట్లయింది. అప్పట్లోనే ఐఏఎస్ అర్వింద్ కుమార్ దగ్గర వివరణ తీసుకున్నారు. తాను కేటీఆర్ నోటి మాట ద్వారా ఇచ్చిన ఆదేశాలను అమలుచేశానని ఆయన రాతపూర్వకంగా తెలిపారు.కానీ కేసులు నమోదు చేయడానికి రేవంత్ సర్కార్ ఏడాది సమయం తీసుకుంది.
Also Read: Manchu Issue: అరెస్టు నుంచి రక్షణ కల్పించలేం - మోహన్ బాబుకు తేల్చి చెప్పిన హైకోర్టు !
ఇక వరుస కేసులు !
కేటీఆర్ పై ఇది మొదటి కేసు. కానీ గవర్నర్ వద్ద నుంచి మొత్తం అవినీతి కేసుల్లో విచారణకు పర్మిషన్ తీసుకున్నారన్న ప్రచారం జరుగుతోదంి. ఒక దాని తర్వాత ఒకటి కేసులు నమోదు చేసే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే విద్యుత్ కొనుగోళ్లు ఇతర అంశాల్లో కేసీఆర్ కేసులు నమోదు చేయడానికి అవసరమైన రిపోర్టు ప్రభుత్వానికి చేరిందని చెబుతున్నారు. జస్టిస్ మదన్ బి లోకూర్ నేతృత్వంలోని కమిషన్ విచారణ చేసి ప్రభుత్వానికి రిపోర్టు సమర్పించింది. అంతకు ముందు జస్టిస్ నర్సింహారెడ్డి కమిషన్ విచారణ జరిపితే సుప్రీంకోర్టుకు వెళ్లారు. సుప్రీంకోర్టు కమిషన్ చైర్మన్ ను మార్చింది. ఇప్పుడు జస్టిస్ లోకూర్ కమిషన్ రిపోర్టు ఇచ్చింది. న్యాయసలహా తీసుకుని అసెంబ్లీలో ప్రవేశ పెడతామని రేవంత్ ప్రకటించారు. తర్వాత ఈ రిపోర్టు ఆధారంగా చర్యలు ఉంటాయని చెబుతున్నారు. ఇక కాళేశ్వరం పై జస్టిస్ ఘోష్ కూడా త్వరలోనే రిపోర్టు ఇవ్వబోతున్నారు. ఇవన్నీ వెంటాడబోతున్నాయని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదంటున్నారు.
Also Read: KTR Letter: అదానీ మీకు శత్రువు, రేవంత్‌కు మిత్రుడా? ఇది డబుల్ స్టాండ్ కాదా? రాహుల్‌కు కేటీఆర్ లేఖ
ప్లాన్ ప్రకారమే ఏడాది పాటు సైలెంట్
రేవంత్ రెడ్డి వ్యూహాత్కకంగానే ఏడాది పాటు ఎలాంటి కేసుల జోలికి వెళ్లకుండా సైలెంట్ గా ఉన్నారని అంటున్నారు. ఇప్పుడు ఆ ఏడాది అయిపోయిందని ఇక అసలు రాజకీయం చేయాల్సిన సమయం వచ్చిందని భావిస్తున్నారని అంటున్నారు. అదే నిజం అయితే రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ ఎన్నో గడ్డు పరిస్థితులను ఎదుర్కొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. కేసీఆర్ వచ్చే ఏడాది ప్రజల్లోకి రావాలనుకుంటున్నారు. ఈ లోపే రేవంత్ రెడ్డి పూర్తి స్తాయి రాజకీయం ప్రారంభిస్తే తీవ్ర ఒత్తిడిని ఎదుర్కోవాల్సి రావొచ్చు. స్థానిక సంస్థల ఎన్నికల్లో గ్రామాల్లో పట్టు నిలుపుకోపతే మరిన్ని సమస్యలు వచ్చి పడే అవకాశం ఉంది.