తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే, సినీ హీరో బాలకృష్ణ హిందూపురం జిల్లా సాధన కోసం ఉద్యమాన్ని నిర్వహించాలని నిర్ణయించారు. ప్రత్యక్షంగా తానే ఉద్యమానికి నాయకత్వం వహించాలని నిర్ణయించారు. ప్రజాస్వామ్య పద్దతుల్లో ఆందోళనలు చేయాలని నిర్ణయించుకున్నారు. ఇప్పటికే హిందూపురం చేరుకున్న ఆయన శుక్రవారం మౌనదీక్ష చేయనున్నారు. ముందుగా హిందూపురంలోని పొట్టి శ్రీరాములు విగ్రహం నుంచి అంబేడ్కర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించనున్నారు. ర్యాలీ అనంతరం అంబేడ్కర్ విగ్రహం వద్ద బాలకృష్ణ మౌనదీక్ష చేయనున్నారు.
పీఆర్సీ ప్రకటించినప్పుడు చప్పట్లు .. ఇప్పుడు తాడోపేడో ఉద్యమం ! ఈ మధ్యలో ఏం జరిగింది ?
మౌనదీక్ష పూర్తయిన తర్వాత అఖిలపక్షాల నేతలతో ఉద్యమ కార్యాచరణపై చర్చించనున్నారు. ఇప్పటికే హిందూపురంలో జిల్లా సాధన ఉద్యమం ఉద్ధృతంగా సాగుతోంది. చిరకాలంగా హిందూపురం జిల్లా డిమాండ్ ఉంది. వైసీపీ మేనిఫెస్టో ప్రకారం.. పార్లమెంటరీ నియోజకవర్గాలను జిల్లా కేంద్రం చేయాల్సి ఉంది. కానీ హిందూపురాన్ని మాత్రం జిల్లా కేంద్రం చేయకుండా పుట్టపర్తిని జిల్లా కేంద్రంగా ప్రకటించారు. దీంతో నందమూరి బాలకృష్ణ అసంతృప్తికి గురయ్యారు. మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన విధంగా ప్రతీ పార్లమెంట్ నియోజకవర్గం కేంద్రంగా జిల్లాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
తగ్గేదే లే.. 5 నుంచి పెన్ డౌన్.. 7 నుంచి సమ్మె .. ప్రభుత్వానికి పీఆర్సీ సాధన సమితి అల్టిమేటం !
కొత్త జిల్లాలు ఏర్పాటు చేయడాన్ని టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఎప్పటి నుండో సమర్థిస్తున్నారు. హిందూపురం నియోజకవర్గం కేంద్రాన్ని జిల్లా చేయాలని ఎప్పట్నుంచో డిమాండ్ ఉంది. పార్లమెంట్ నియోజకవర్గ కేంద్రం కూడా . దీంతో ప్రభుత్వం ఎప్పుడు కొత్త జిల్లాలు ప్రకటించినా హిందూపురం జిల్లా అవుతుందని అనుకున్నారు. కానీ అలా జరగలేదు. జిల్లాల విభజన అనేది మంచిపని అని అయితే రాజకీయం చేయడం మంచిది కాదని తక్షణం హిందూపురాన్ని జిల్లా కేంద్రంగా ప్రకటించాలని బాలకృష్ణ కోరుతున్నారు.
ఆంధ్ర ఉద్యోగుల్లో ఇంత ఆవేశం ఎందుకు ? జీతాలు పెరుగుతున్నాయన్న ప్రభుత్వ వాదన అబద్దమేనా ?
జిల్లా కేంద్రానికి అవసరమైన అన్ని రకాల మౌలిక సదుపాయాలు హిందూపురంలో ఉన్నాయని .. ప్రభుత్వ కార్యాలయాల ఏర్పాటుకు అవసరమైన భూమి పుష్కలంగా ఉందని బాలకృష్ణ చెబుతున్నారు.అందుకే జిల్లాల ఏర్పాటులో రాజకీయం చేయవద్ద ..హిందూపురం ప్రజల మనోభావాలను గౌరవించి వారి చిరికాల కోరికైన హిందూపురం జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయాలని బాలకృష్ణ కోరుతున్నారు. ఉద్యమం పై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.