అమరావతి : ఏపీ పీసీసీ అధ్యక్షుడిగా గిడుగు రుద్రరాజు నియమితులయ్యారు. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ లో భారీ మార్పులు జరిగాయి. కొత్త పీసీసీ చీఫ్‌తో పాటు కొన్ని కమిటీలను సైతం నియమించారు. ఈ మేరకు ఏఐసీసీ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుత పీసీసీ చీఫ్ పనితీరుపై అసంతృప్తిగా ఏఐసీసీ శైలజానాథ్ కు షాకిచ్చింది. ఆయనను ఆ పదవి నుంచి తొలగిస్తూ గిడుగు రుద్రరాజును రాష్ట్ర కాంగ్రెస్ బాస్ నియమించారు. 18 మందితో పొలిటికల్‌ అఫైర్స్‌ కమిటీని ఏర్పాటు చేసింది. 33 మందితో కో ఆర్డినేషన్‌ కమిటీని ఏఐసీసీ నియమించింది. 


ఏపీ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్స్..
ఏపీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్లుగా మస్తాన్ వలి
జంగా గౌతమ్
సుంకర పద్మశ్రీ
రాకేశ్‌ రెడ్డి


ఏఐసీసీ ప్రోగ్రాం ఇంప్లిమెంటేషన్ కమిటీ (కార్యక్రమాల అమలు కమిటీ) ఛైర్మన్ గా మాజీ మంత్రి ఎంఎం పల్లం రాజును నియమించారు. పీసీసీ ప్రచార కమిటీ చైర్మన్‌గా మాజీ ఎంపీ హర్షకుమార్‌ నియమితులయ్యారు. మీడియా, సామాజిక మాధ్యమాల కమిటీ చైర్మన్ గా ఎన్ తులసిరెడ్డికి బాధ్యతలు అప్పగించారు.


గిడుగు రుద్రరాజు గతంలో ఎమ్మెల్సీగా సేవలు అందించారు. ఏఐసీసీ కార్యదర్శిగా ఒడిశా సహాయ ఇంఛార్జి బాధ్యతలు నిర్వహించారు. దివంగత నేత, ఉమ్మడి ఏపీ మాజీ సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డికి, ఆయన మిత్రుడు కేవీపీలకు సన్నిహితుడు రుద్రరాజు. పార్టీని ముందుకు తీసుకెళ్లాలంటే పీసీసీ చీఫ్ మార్పు అవసరమని భావించిన ఏఐసీసీ శైలజానాథ్ ను ఆ బాధ్యతల నుంచి తప్పిస్తూ.. గిడుగు రుద్రరాజుకు బాధ్యతలు అప్పగించింది.  2014, 2019 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కనీసం ఒక్కటంటే ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోయింది. మరోవైపు ఇటీవల కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నికైన మల్లిఖార్జున ఖర్గే ఏపీలో పార్టీ ప్రక్షాళన దిశగా అడుగులు వేస్తూ రాష్ట్రంలో పీసీపీ కొత్త కార్యవర్గాన్ని నియమించారు.




కో ఆర్డినేషన్ కమిటీ సభ్యులు వీరే..
1. ఉమెన్ చాందీ
2. సీడీ మెయ్యప్పన్
3. క్రిస్టోఫర్ తిలక్
4. గిడుగు రుద్రరాజు
5. కిరణ్ కుమార్ రెడ్డి
6. కేవీపీ రామచంద్రరావు
7. రఘువీరారెడ్డి
8. డాక్టర్ సాకె శైలజానాథ్
9. ఎంఎం పల్లంరాజు
10. డాక్టర్ చింతా మోహన్
11. టి.సుబ్బరామిరెడ్డి
12. జేసుదాసు శీలం
13. జీవీ హర్ష కుమార్
14. కె బాపిరాజు
15. ఎన్ తులసిరెడ్డి
16. కె రాజు
17. సాయి ప్రతాప్
18. మస్తాన్ వలీ
19. డాక్టర్ సిరివెల్ల ప్రసాద్
20. ఉషా నాయుడు
21. జంగా గౌతమ్
22. పద్మశ్రీ సుంకర
23. రాకేశ్ రెడ్డి
24. షాజహాన్ బాషా
25. కమలమ్మ
26.  ఎన్ వరదరాజులు రెడ్డి
27. సుధాకర్
28. సత్యవతి
29. వినయ్ కుమార్
30. కె బి ఆర్ నాయుడు
31. ఎం సూర్య నాయక్
32. జెట్టి గురునాథరావు
33. శ్రీరామ మూర్తి






Also Read: Vishnu Kumar Raju : ఏప్రిల్ నుంచి విశాఖ రాజధానిగా పాలన, సీఎం జగన్ అలా చేస్తే ఎవరూ అడ్డుకోలేరు - బీజేపీ నేత విష్ణు కుమార్ రాజు