AP BJP On KCR : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తీరు ఇతరుల్లో ఆంధ్రులంటే చులకన భావం ఏర్పరిచేలా ఉందని ఏపీ బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. అతిథి దేవో భవ అనేది మన సంస్కృతి అని .. అతిథుల్ని అగౌరవ పర్చే పనిని ఓ ముఖ్యమంత్రి స్వయంగా చేపట్టడం సరి కాదని ఏపీ బీజేపీ ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి విమర్శించారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ రెండు రోజుల పర్యటనకు తెలంగాణకు వస్తున్నారు. ఆయనకు స్వాగతం చెప్పేందుకు ప్రోటోకాల్ ప్రకారం సీఎం కేసీఆర్ వెళ్లాల్సి ఉంది. అయితే కేసీఆర్ మాత్రం వెళ్లడం లేదు. ప్రభుత్వ ప్రతినిధిగా ప్రధానికి స్వాగతం చెప్పే బాధ్యతను మంత్రి తలసానికి అప్పగించారు.
యశ్వంత్ సిన్హాకు సీఎం కేసీఆర్ ఘన స్వాగతం - బేగంపేట నుంచి జలవిహార్ వరకు TRS బైక్ ర్యాలీ
ఈ విషయాన్నే విష్ణువర్ధన్ రెడ్డి ప్రశ్నించారు. కేసీఆర్ ప్రధాని మోదీకి స్వాగతం చెప్పనంత మాత్రాన .. మోదీకి వచ్చే గౌరవం ఏమీ తగ్గదని..కానీ ఇలాంటి చర్యల వల్ల అతిధుల్ని తెలుగువారు సరిగ్గా గౌరవించరన్న అపవాదు వస్తుందన్నారు. అందరినీ గౌరవించడం తెలుగు సంస్కృతి మనకు నేర్పిందన్నారు. వ్యక్తిగతం అయితే ఆహ్వనించవచ్చు లేకపోవచ్చు కానీ.. ఓ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రధానిని గౌరవించాల్సి ఉందన్నారు. అలా చేయకపోవడం వల్ల దేశ్యాప్తంగా తప్పుడు సంకేతాలు పంపినట్లయిందన్నారు.
మహారాష్ట్ర తర్వాత తెలంగాణనేనా ? బీజేపీ హిట్‌లిస్ట్‌లో తర్వాత టీఆరెస్సెనా ?
భారతీయ జనతా పార్టీతో రాజకీయంగా విభేదాలు ప్రారంభమైన తర్వాత సీఎం కేసీఆర్ ప్రధాని మోదీతో భేటీ కాలేదు. అదే సమయంలో తెలంగాణ పర్యటనకు వచ్చినా స్వాగతం చెప్పడం లేదు. ఇటీవలి కాలంలో మూడో సారి మోదీ తెలంగాణ పర్యటనకు వచ్చారు. ఒక్క సారి కూడా కేసీఆర్ స్వాగతం చెప్పలేదు. ప్రోటోకాల్ ప్రకారం.. స్వాగతం చెప్పాల్సిన బాధ్యతను సీనియర్ మంత్రి అయిన తలసానికి అప్పగిస్తూ వస్తున్నారు.
అయితే సీఎం రావొద్దన్నారని అందుకే గతంలో స్వాగతం చెప్పలేదని టీఆర్ఎస్ వర్గాలు చెబుతూ ఉండేవి. అయితే ఈ విషయాన్ని బీజేపీ వర్గాలు ఖండించాయి. గతంలో అనారోగ్యం వల్ల హాజరు కాలేకపోయినట్లుగా సీఎంవో ఇచ్చిన ప్రకటలను బీజేపీ గుర్తు చేస్తూ వస్తోంది. అయితే ఈ సారి మోదీ వస్తోంది.. రాజకీయ కార్యక్రమానికి అని.. దానికి స్వాగతం చెప్పాల్సతిన అవసరం ఏముందని టీఆర్ఎస్ వర్గాలు ప్రశ్నిస్తున్నాయి. అలా అయితే తలసానని ఎందుకు పంపారని బీజేపీ వర్గాలు కౌంటర్ ఇస్తున్నాయి. మొత్తానికి ప్రధాని పర్యటనలకు ఎప్పటికప్పుడు కేసీఆర్ డుమ్మా కొడుతూండటం మాత్రం వివాదాస్పదమవుతోంది.