BJP Plenary In Hyderabad: బీజేపీ కార్యవర్గ సమావేశాలు నేడు హైదరబాద్ వేదికగా ప్రారంభం కానున్నాయి. ఈ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేటి నుంచి రెండు రోజులపాటు తెలంగాణలో పర్యటించనున్నారు. అయితే ప్రధాని మోదీ హైదరాబాద్ పర్యటన నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర సమితి (TRS) కొన్ని ప్రశ్నలు సంధించింది. తెలంగాణ పట్ల మొదట్నుంచీ ఎందుకు చిన్నచూపు చూస్తున్న ప్రధాని మోదీ ప్రభుత్వం..  తెలంగాణలో ఏర్పాటుచేస్తామని ప్రకటించిన తరువాత ఇతర రాష్ట్రాలకు తరలించిన సంస్థలపై రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలని తమ అధికారిక ట్విట్టర్‌లో ప్రశ్నించింది.


ప్రధాని మోదీకి టీఆర్ఎస్ సంధించిన ప్రశ్నలు ఇవే.. 



  •  హైదరాబాద్‌లో ఏర్పాటు చేస్తామన్న అంతర్జాతీయ సంప్రదాయ వైద్య కేంద్రాన్ని గుజరాత్ కు ఎందుకు తరలించుకుపోయారు ?
    గుజరాత్, కర్ణాటక రాష్ట్రాల్లో వరదలు వస్తే పరిగెత్తుకుంటూ పోయి నిదుల వరదను పారించిన ప్రధాని మోదీ.. హైదరాబాద్ వరదల విషయంలో ఎందుకు వివక్ష చూపారు ?

  • కర్ణాటకలో, మధ్యప్రదేశ్ లోని ప్రాజెక్ట్ కు జాతీయ హోదా ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం తెలంగాణలో ఒక్క ప్రాజెక్టుకు కూడా ఎందుకు జాతీయ హోదా ఇవ్వలేదు ?

  • కర్ణాటకలో ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీ, ఎకనామిక్ కారిడార్, టెక్స్‌టైల్ మెగా క్లస్టర్, బయో క్లస్టర్‌లను ఏర్పాటు చేసిన కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు ఒక్కటంటే ఒక్కటీ ఎందుకు కేటాయించలేదు  ?

  • యూపీకి రూ.55,563 కోట్ల ప్రాజెక్టులను మంజూరు చేసిన ప్రధాని మోదీ.. తెలంగాణలో ఒక్క ప్రాజెక్టుకైనా పైసా సాయం ఎందుకు చేయలేదు  ?
    గుజరాత్, యూపీలో యూనివర్సిటీలకు జాతీయ హోదాలు కట్టబెట్టిన మోదీ.. తెలంగాణలో ఒక్క ఉన్నత విద్యాసంస్థ జాతీయ హోదాకు అర్హత ఉన్నట్లు కనిపించలేదా  ?






  • గుజరాత్‌కు బుల్లెట్ ట్రైన్‌ను తీసుకొని పోయిన ప్రధాని మోదీ.. తెలంగాణలో కనీసం పెండింగ్ రైల్వే ప్రాజెక్టులనైనా ఎందుకు పూర్తి చేయలేదు  ?
    గుజరాత్‌కు గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్ పోర్టును అప్పనంగా ఇచ్చిన ప్రధాని మోదీ.. తెలంగాణకు ఆరు డొమెస్టిక్ విమానాశ్రయాలను క్లియర్ చేయడంలో ఎందుకు వివక్ష చూపుతున్నారు  ?

  • తెలంగాణకు రెండు ఇండస్ట్రియల్ కారిడార్లకోసం తెలంగాణ ప్రతిపాదనలను ఎందుకు ఆమోదించలేదు  ?

  • రక్షణ భూములు కావాలని కర్ణాటక అడిగిందే తడవుగా ఇచ్చిన మోదీ.. హైదరాబాద్‌లో స్కైవేల నిర్మాణం కోసం రక్షణ భూములు కావాలని రిక్వెస్ట్ చేసినప్పటికీ ఎందుకు ఇవ్వడం లేదు  ?

  • తెలంగాణ సమాజం ఈ విషయాపై మిమ్మల్ని నిగ్గదీసి అడుగుతోంది.. మోదీ కార్యవర్గం వీటికి ఏం జవాబు చెప్తుంది  ? అని నేడు హైదరాబాద్‌ పర్యటనకు రానున్న నేపథ్యంలో ప్రధాని మోదీని, ఆయన ప్రభుత్వాన్ని అధికార టీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించింది. 


Also Read: High Alert in Hyderabad: భద్రతా వలయంలో భాగ్యనగరం - హైదరాబాద్‌కు ప్రధాని మోదీ రాక నేపథ్యంలో హై అలెర్ట్‌ 


Also Read: BJP Plenary Food Menu: బీజేపీ ప్లీనరీలో అదిరిపోయే వంటకాలు, తెలంగాణ స్పెషల్ ఐటమ్స్‌తో మెనూ చూశారా !