Andhra Pradesh is getting an investment friendly image again :  రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ వ్యవసాయాధారిత రాష్ట్రం అయింది. పారిశ్రామికీకరణ తక్కువగా ఉంది. అలాంటి సమయంలో సీఎంగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబునాయుడు ఐదేళ్లలో పెట్టుబడుల ఫ్రెండ్లీ ఇమేజ్ తీసుకు వచ్చారు. దేశంలోనే అతి పెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టబడి కియా పరిశ్రమను తీసుకు రావడమే కాదు.. రెండేళ్లలోపు ఉత్పత్తి కూడా ప్రారంభించగలిగేలా చేశారు. ఇప్పుడు  దేశంలో ఎక్కడ కియాకారు కనిపించినా మేడిన్ అనంతపురం ఇని తెలుగువాళ్లు గుర్తు చేసుకుంటారు. ఇక  హీరో, అశోక్ లేలాండ్. హెచ్‌సీఎల్ సహా అనేక కంపెనీలు వచ్చాయి. అంతకు మించి అనేక మంది పెట్టుబడిదారులు ఎంవోయూలు చేసుకున్నారు. కానీ చంద్రబాబు అనూహ్య రీతిలో ఓడిపోవడం.. తర్వాత వచ్చిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆ ఎంవోయూలను మెటీరియలైజ్ చేసేందుకు ఏ మాత్రం అవకాశం ఇవ్వకపోవడంతో ..వెనుకబడినట్లయింది. 


వైఎస్ జగన్ హయాంలో అనేక రివర్స్ నిర్ణయాలు


చంద్రబాబు  హయాంలో అమరావతి సస్టెయినబుల్ సిటీల్లో అమరావతి ప్రపంచానికి ఓ మోడల్ అవుతుందని అంతర్జాతీయ మీడియా కూడా అభిప్రాయం వ్యక్తం చేసింది. అయితే జగన్మోహన్ రెడ్డి అమరావతిని పూర్తిగా పక్కన పెట్టేశారు. సింగపూర్ కన్సార్టియంతో జరిగిన ఒప్పందాన్ని రద్దు చేసుకున్నారు. అమరావతిలో ఒక్కటంటే ఒక్క పని కూడా జరగాల్సిన పని లేదని తీర్మానించి మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్నారు. పీపీఏలు రద్దు చేయడం.. లూలూ మాల్ వంటి పారిశ్రామిక వేతల్ని పంపేయం వంటివి ఏపీ ఇమేజ్ ను దెబ్బతీశాయి. ఐదేళ్ల కాలంలో నికరంగా వచ్చిన పెట్టుబడి అంటూ ఏపీలో ఏం లేదని టీడీపీ వర్గాలు చాలా కాలంగా విమర్శలు గుప్పిస్తూనే ఉన్నాయి. ఐదేళ్ల కాలంలో ఏపీకి ఏం పరిశ్రమ వచ్చిందా అని ఆలోచిస్తే.. ఏమీ చెప్పలేని పరిస్థితి ఉంది. 


మేకపాటి విరాళానికి రాజకీయం అడ్డంకి- చంద్రబాబుకు స్పీడ్ పోస్టు- తెలంగాణలో మాత్రం నేరుగా అందజేత!


చంద్రబాబు సీఎం అయ్యాక పలు  పెట్టుబడుల ప్రతిపాదనలు


చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత వెంటనే కేంద్రం మచిలీపట్నంలో రిఫైనరీ ఏర్పాటు చేసే విషయాన్ని ప్రకటించింది. అక్కడ్నుంచి వరుసగా పెట్టుబడుల ప్రతిపాదనలు వస్తూనే ఉన్నాయి. తాజాగా  గాంధీనగర్ లో జరిగిన  వాయు, సౌర విద్యుత్ సదస్సులో కూడా పలు కంపెనీలు పెట్టుబడులకు ఆసక్తి చూపించాయి. అనేక మంది ప్రస్తుతం ఉన్న  తమ యూనిట్లను విస్తరించడానికి ముందుకు వస్తున్నారు. ఎక్కువ మంది తమకు రావాల్సిన పరిశ్రామిక రాయితీల గురించే  ప్రస్తావిస్తున్నారు. గత ప్రభుత్వం ఒప్పందం ప్రకారం ఇవ్వాల్సిన రాయితీలను చాలా వరకూ ఆపేసింది. కొన్ని పరిశ్రమలకు మాత్రమే ఇచ్చింది. చంద్రబాబు సీఎం అయిన వంద రోజుల్లో అనేక పెట్టుబడుల ప్రతిపాదనలు వచ్చాయి. వాటిలో సగం గ్రౌండింగ్ అయినా.. భారీ స్థాయిలో పారిశ్రామికీకరణ జరుగుతుంది. 


అమరావతితో మరితంగా పెట్టుబడుల ఆకర్షణ


గతంలో రాజధాని లేకపోవడం పెద్ద మైనస్. ఎన్నికల ఫలితాలతో రాజధాని ఏదన్న సమస్య తీరిపోయింది. కేంద్రం పదిహేను వేల కోట్ల నిధులను ప్రకటించింది. డిసెంబర్ నుంచి అమరావతి పనులు ప్రారంభం కానున్నాయి. ఆ తర్వాత అమరావతిలో  ప్రైవేటు పెట్టుబడులు కూడా పెద్ద ఎత్తున వస్తాయని భావిస్తున్నారు. ఆ తర్వాత ఇక వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం ఉండదని అంచనా వేస్తున్నారు. ఇప్పుడు మళ్లీ పెట్టుబడుల పరంగా ఏపీ ట్రాక్ లోకి వచ్చిందని నమ్ముతున్నారు. 



Also Read: ఏపీ ప్రభుత్వం ప్రపంచ రికార్డు - ఒకేరోజు 13,326 గ్రామసభలు, డిప్యూటీ సీఎంగా పవన్ బాధ్యతలు చేపట్టిన 100 రోజుల్లోనే