గౌతమ్ అదానీకి కానీ ఆయన భార్య ప్రీతి అదానీ కానీ ఎలాంటి రాజకీయ పార్టీల్లో చేరబోవడం లేదని వారికి రాజకీయ ఆసక్తి లేదని  అదానీ గ్రూప్ అధికారికంగా ప్రకటించింది. ఇటీవల ఇద్దరిలో ఒకరు రా‌జ్యసభకు వెళ్లబోతున్నారన్న ప్రచారం జరుగుతోందని అది అవాస్తవమని ప్రకటించారు. ఈ మేరకు అదానీ గ్రూప్ అధికారిక ట్విట్టర్ హ్యాండిల్‌లో ప్రకటించారు. 



అదానీ కుటుంబం నుంచి ఒకరిని రాజ్యసభ కు పంపేందుకు ఆంధ్రప్రదేశ్ ఆధికార పార్టీ  వైఎస్ఆర్‌సీపీ తరపున జగన్ ఆఫర్ ఇచ్చారన్న ప్రచారం జరుగుతోంది. ఎన్నికల షెడ్యూల్ కూడా రావడంతో ప్రచారం ఉద్ధృతం అయింది.  గౌతమ్ అదానీ లేదా ఆయన భార్య ప్రీతి అదానీల్లో ఒకరికి చాన్స్ ఇస్తారని చెప్పుకున్నారు. ఇద్దరు కాకపోతే ఆయన కుమారుడికైనా చాన్సిస్తారన్న ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారాన్ని వైఎస్ఆర్‌సీపీ నేతలెవరూ ఖండించలేదు. అయితే హఠాత్తుగా అదానీ గ్రూప్ నుంచే వివరణ వచ్చింది. 


అమ్మలక్కలు తిట్టిస్తా - టీడీపీ నేతలకు మాజీ మంత్రి అనిల్ హెచ్చరిక !


దీంతో ఏపీ నుంచి అదానీ కోటాలో ఎవరికీ రాజ్యసభ ఇవ్వడం లేదని క్లారిటీ వచ్చినట్లయింది. అదానీ గ్రూప్‌లో ఎవరికీ రాజకీయ పార్టీల్లో చేరే ఉద్దేశం లేదని అదానీ గ్రూప్ ఇచ్చిన ప్రకటనలో ఉంది. గతంలో రిలయన్స్ తరపున సీటు పొందిన పరిమళ్ నత్వానీ కి కూడా వైఎస్ఆర్‌సీపీ అగ్రనేతలు పార్టీలో చేరాలని షరతు పెట్టారు. దానికి ఆయన అంగీకరించారు. గుజరాత్‌కు చెందిన ఆయన ఏపీలో వైఎస్ఆర్‌సీపీ పార్టీ సభ్యత్వం తీసుకుని ఆ పార్టీ తరపున నామినేషన్ వేసి.. రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. 


తెలంగాణలో రాజకీయ పర్యాటకం కొనసాగుతోంది, మరో టూరిస్ట్ వచ్చారు వెళ్లారు- అమిత్‌షా టూర్‌పై కేటీఆర్‌ సెటైర్లు
 
ఇప్పటి వరకూ ఇద్దరు బీసీ, ఒక రెడ్డి సామాజికవర్గానికి చెందిన వారికి రాజ్యసభ సీట్లు ఖరారయ్యాయని వైఎస్ఆర్‌సీపీ వర్గాలు చెబుతున్నాయి. బీద మస్తాన్ రావు, కిల్లి కృపారాణితో పాటు విజయసాయిరెడ్డికీ బెర్తులు కన్ఫర్మ్ అయ్యాయని మరొకటి అదానీ గ్రూప్‌కు ఇస్తారని అనుకున్నారు. ఇప్పుడు ఇవ్వడం లేదని తెలియడంతో  ఆ సీటు ఎవరికి ఇస్తారన్న ఆసక్తి ప్రారంభమయింది .


తెలంగాణలో బీజేపీ పావుగా కేఏ పాల్ ! ఓట్ల చీలిక కోసం ప్రోత్సహిస్తున్నారా ?