"గడప గడపకూ మన ప్రభుత్వం" కార్యక్రమంలో కొంత మంది తెలుగుదేశం పార్టీ ( TDP ) నేతలు, కార్యకర్తలు ప్రజల్ని రెచ్చగొడుతున్నారని మాజీ మంత్రి అనిల్ కుమార్ ( Anil kumar ) యాదవ్ అసహనం ఫీలవుతున్నారు.  తెలుగుదేశం పార్టీ నేతలకు ఆయన  హెచ్చరికలు జారీ చేశారు. . టీడీపీ కార్యకర్తలు అక్కడక్కడా కావాలనే అడ్డు తగులుతున్నారని, అలాంటి సంఘటనలను  మీడియా కావాలనే హైలెట్ చేస్తోందని విమర్శించారు. కొన్ని యూట్యూబ్ ఛానెళ్లకు తన ఫొటో,  కొడాలి నాని ( Kodali Nani ) ఫొటో పెట్టుకోనిదే వ్యూస్ రావని ఎద్దేవా చేశారు. 


కాలేజ్ హాస్టల్ గోడదూకి నలుగురు బాలికలు పరార్, ఎక్కడికెళ్లారో తెలిస్తే అవాక్కవ్వాల్సిందే!


ఇటీవల అనిల్ కుమార్ యాదవ్ ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు తన నియోజకవర్గంలోని ఓ కాలనీకి వెళ్లారు. అక్కడ ప్రజలు ఆయనను చుట్టు ముట్టారు. సమస్యలపై నిలదీశారు. వారికి సమాధానం చెప్పలేకపోవడంతో ఆయన కారులో ఎక్కి హడావుడిగా వెళ్లిపోయారు. ఈ వీడియోను అనేక యూట్యూబ్ చానళ్లు రిపోర్ట్ చేశాయి. రకరకాల థంబ్ నెయిల్స్ పెట్టి ప్రచారం చేశాయి.  ఇవి ఆయన దృష్టికి వెళ్లడంతో  ఫీలయినట్లుగా కనిపిస్తోంది. అందుకే రెండు రోజులుగా ఆయన యూ ట్యూబ్ చానళ్లపై విరుచుకుపడుతున్నారు. అలాంటి వారంతా తెలుగుదేశం పార్టీ వారేనని ఆయన నమ్ముతున్నారు. 


రాజ్యసభ సభ్యత్వాల్లో నెల్లూరుకి లక్కీ ఛాన్స్


తమను అడ్డుకున్నట్లుగా.. తిడుతన్నట్లుగా టీడీపీ నేతల్ని కూడా తాము తిట్టించగమని ఆయన అంటున్నారు.  టీడీపీ నాయకులు కూడా జనాల్లోకి వస్తున్నారని, తాము కూడా వారిని అమ్మలక్కలు తిట్టించగలమని హెచ్చరించారు. అలా తిట్టించి  ప్రచారం చేయింగలమన్నారు.  తమను అడ్డుకోవడం.. విమర్శించడం మానుకోకబోతే అదే జరుగుతుందని హెచ్చరించారు. 


ఆవనూనెపై దిగుమతి సుంకం తగ్గించండి, కేంద్ర మంత్రులకు సీఎం జగన్ లేఖలు


అనిల్ కుమార్ , కొడాలి నాని మాజీ మంత్రులు. వీరిద్దరూ జగన్‌కు సన్నిహితులు.  అత్యంత విధేయత చూపిన వీరికి మంత్రి పదవి ఉంటుందనుకున్నారు. కానీ ఉండలేదు. మాజీలయ్యారు. అప్పట్నించి వారిపై సోషల్ మీడియాలో ట్రోలింగ్స్ నడుస్తున్నాయి. ఓ వైపు పదవి పోయిన అసహనం.. మరో వైపు పార్టీ హైకమాండ్ కూడా ప్రాధాన్యత తగ్గించిన వైనం ఆయనను ఇబ్బందికి గురి చేస్తోంది. అందుకే ఆయన ఇలా పదే పదే కంట్రోల్ తప్పుతున్నారని విపక్షాలు విమర్శిస్తున్నాయి.  ప్రజలు నిలదీస్తున్నారు తప్ప టీడీపీ నేతలు కాదంటున్నారు. అలా అయితే...  ప్రజంలతా టీడీపీనేనా అని ప్రశ్నిస్తున్నారు.