Khammam Photos: భారీ వర్షాలు, వరద తగ్గాక ఖమ్మం ఎలా ఉందో ఫొటోలు చూశారా!
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం, ఆపై వాయుగుండంతో మారడంతో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో మూడు రోజులపాటు కురిసిన భారీ వర్షానికి జన జీవనం అస్తవ్యస్తమైంది. (Photos: ఉపేందర్/ ఖమ్మం)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఎడతెరపిలేకుండా కురిసిన వర్షాలు, వరద ప్రవాహంతో తెలంగాణలో 20 మంది వరకు ప్రాణాలు కోల్పోయారు. ముఖ్యంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాను వర్షాలు వణికించాయని చెప్పాలి. (Photos: ఉపేందర్/ ఖమ్మం)
మానవ తప్పిదాలతోనే వరద పరిస్థితిని సరిగ్గా ఎదుర్కోలేకపోయామని.. సహజసిద్ధంగా ఉన్న కుంటలు, చెరువులు జలశయాలను కబ్జా చేయడమే విపత్తు తీవ్రత మరింత పెంచుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. (Photos: ఉపేందర్/ ఖమ్మం)
భారీ వర్షాలు తగ్గిన తరువాత, ఖమ్మం నగరం ఇప్పుడిప్పుడే వరద ముప్పు నుంచి కోలుకుంటోంది. ప్రస్తుతం వర్షాలు తగ్గిన తరువాత ఖమ్మం ఇలా ఉంది. (Photos: ఉపేందర్/ ఖమ్మం)
రఘునాథపాలెం, బల్లేపల్లి, పాండురంగాపురం, ఖానాపురం చెరువుల నుంచి ఖమ్మంలోని లకారం చెరువులోకి వరద నీరు ప్రవహించాల్సి ఉంది. ఆపై లకారం నుంచి ధంసలాపురం చెరువుకు అలుగువాగు అనుసంధానమై ఉంటుంది. ఇది నిండితే నీళ్లు అలుగు పోయి మున్నేరులో కలుస్తాయి. (Photos: ఉపేందర్/ ఖమ్మం)
ఓవైపు అభివృద్ధి పేరిట లకారం చెరువులోకి నీరు ప్రవేశించేందుకు వీలు లేకుండా నిర్మాణాలు జరిగాయి. మరోవైపు చెరువుల కింద ఉండే భూములు ఆక్రమణకు గురవడంతో వరద నీరు ఇళ్లోకి వచ్చి చేరుతోంది. (Photos: ఉపేందర్/ ఖమ్మం)
మరోవైపు ఖమ్మం నుంచి సాగర్ ప్రధాన కాలువ తవ్వారు. ఇక్కడ పంట పొలాలు రియల్ ఎస్టేట్ వెంచర్లుగా మారడంతో ప్రధాన కాల్వకు అనుసంధానంగా జలాశయాలు మాయమయ్యాయి. మున్నేరును ఆనుకుని ఖమ్మంలోని పలు కాలనీలున్నాయి. తక్కువ సమయంలో ఎక్కువ వరద రావడంతో ఆ కాలనీలు నీట మునిగాయి. (Photos: ఉపేందర్/ ఖమ్మం)
వర్షాలు తగ్గడంతో వరద నీరు ప్రవహం తగ్గిపోయింది, మళ్లీ సామాన్యులు రెగ్యూలర్ లైఫ్ లోకి వస్తున్నారు. రెస్క్యూ టీమ్స్ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. నిరాశ్రయులకు ప్రభుత్వం ఆహారం, నీళ్లు అందిస్తోంది. (Photos: ఉపేందర్/ ఖమ్మం)