Sobhita Dhulipala: నాగచైతన్యను కలిసేందుకు హైదరాబాద్‌కు శోభిత - ఎయిర్‌పోర్టులో అక్కినేని కోడలు సందడి చూశారా!
Sobhita Dhulipala Photo: అక్కినేని కాబోయే కోడలు శోభిత ధూళిపాల ముంబై ఎయిర్‌పోర్టులో సందడి చేసింది. నిశ్చితార్థం తర్వాత ఫస్ట్‌టైం ఆమె మీడియా అప్పియరేన్స్ ఇచ్చింది. (Sobhita Dhulipala Airport Photos)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఈ సందర్బంగా ఆమెను తమ కెమెరాలో బందించేందుకు మీడియా ఆసక్తి చూపించింది. ఇందులో శోభిత బేబి పింక్ కలర్ షర్ట్, క్రిం కలర్ ప్యాంటులో కూల్ లుక్‌లో కనిపించింది. (Sobhita Dhulipala Airport Photos)
స్టైలిష్‌గా ఎయిర్‌పోర్టు లోపలికి నడుచుకుంటూ వెళుతున్న ఆమెను కెమెరాలో క్లిక్ మనించారు. ప్రస్తుతం శోభిత ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇవి చూసి నాగచైతన్యను కలిసేందుకు వెళ్తున్నావా? అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. (Sobhita Dhulipala Airport Photos)
కాగా మొన్నటి వరకు నటిగా ఉన్న శోభిత ఇప్పుడు అక్కినేని కోడలు కాబోతుండటంతో ఆమెకు మరింత క్రేజ్ పెరిగింది. ఎక్కువగా బాలీవుడ్ సినిమాల్లో నటించిన ఆమె తెలుగులో చేసింది తక్కువ సినిమాలే. (Sobhita Dhulipala Airport Photos)
అడవి శేష్ గుఢాచారి మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఆమె ఆ తర్వాత మేజర్,పొన్నియిన్ సెల్వన్ చిత్రాల్లో కీలక పాత్రలు పోషించింది. అంతేకాదు ఇటివల ఆమె మంకీ మ్యాన్ తో హాలీవుడ్ మూవీలోనూ నటించింది. (Sobhita Dhulipala Photos)
అన్ని భాషల్లోనూ నటిస్తూ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు పొందింది. పాత్రకు ప్రాధాన్యత ఉన్న రోల్స్ చేస్తూ నటిగా రాణిస్తుంది. ఇక త్వరలోనే నాగ చైతన్యను పెళ్లి చేసుకుని అక్కినేని వారి ఇంట కోడలిగా అడుగుపెట్టబోతుంది ఈ మేజర్ బ్యూటీ. (Sobhita Dhulipala Airport Photos)
కాగా ఆగష్టు 8వ తేదిన నాగచైతన్య, శోభితల నిశ్చితార్థం చేసుకున్న సంగతి తెలిసిందే. సీక్రెట్‌గా జరిగిన వీరి ఎంగేజ్మెంట్ ఫోటోలు బయటకు రావడంతో అంతా షాక్ అయ్యారు. (Sobhita Dhulipala Airport Photos)
కొంతకాలంగా రిలేషన్లో ఉన్న వీరిద్దరు పెళ్లి బంధంతో వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టబోతున్నారు. కాగా నాగ చైతన్యకు ఇది రెండో పెళ్లనే విషయం తెలిసిందే. (Sobhita Dhulipala Airport Photos)
Sobhita Dhulipala: నాగచైతన్యను కలిసేందుకు బయలుదేరిన శోభిత - ఎయిర్‌పోర్టులో అక్కినేని కోడలు సందడి చూశారా!