In Pics: అగ్ని ప్రమాద బాధితుల వద్దకు సీతక్క - పెద్దమనసుతో తక్షణం ఆదుకున్న ఎమ్మెల్యే
అగ్నిప్రమాదం జరిగిన శనీకుంట గ్రామంలో పర్యటించిన ఎమ్మెల్యే సీతక్క
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఇండ్లు కోల్పోయిన బాధితులకు నిత్యావసర సరకులు అందజేత
బాధితులకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను కట్టించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన ఎమ్మెల్యే సీతక్క
బాధిత కుటుంబాలను పరామర్శించి 50 వేల ఆర్థిక సాయంతో పాటు 11 క్వింటాళ్ల బియ్యం అందచేత
మంగపేట మండలం శనిగ కుంట గ్రామంలో నిన్న రాత్రి అగ్ని ప్రమాదం సంభవించింది.
24 ఇండ్లు పూర్తిగా దగ్ధం కాగా వారి కుటుంబాలను ఎమ్మెల్యే సీతక్క పరామర్శించారు.
బాధిత కుటుంబాలకు కాంగ్రెస్ పార్టీ నాయకుల సహకారంతో 50 వేల తక్షణ ఆర్థిక సాయం అందించారు.
మరో 11 క్వింటాళ్ల బియ్యం, నిత్యావసర వస్తువులు, బట్టలు, వంట సామాగ్రి బాధిత కుటుంబాలకు అందించారు.
ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన బాధిత కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
డబుల్ బెడ్ రూం ఇంటితో పాటు ఒక్కో కుటుంబానికి రూ.లక్ష తక్షణ సాయం అందించాలని సీతక్క డిమాండ్ చేశారు.