In Pics: కేసీఆర్కు మహిళల మంగళహారతులు, వీర తిలకాలు - ఫోటోలు
తెలంగాణ లోక్ సభ ఎన్నికల కోసం మాజీ సీఎం కేసీఆర్ చేస్తున్న ప్రచార యాత్ర బస్సు ఆయన సొంత నియోజకవర్గం గజ్వేల్ మీదుగా సాగింది.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appకేసీఆర్ బస్సు యాత్ర తమ పట్టణం చేరుకోవటం పట్ల గజ్వేల్ నియోజకవర్గ ప్రజలు ఆనందంతో ఆహ్వానం పలికారు.
గజ్వేల్ చేరుకున్న తమ నేతకు మంగళ హారతులతో స్వాగతం పలికి విజయ తిలకం దిద్ది.. బస్సు యాత్రను నర్సాపూర్ దిశగా సాగనంపారు.
ఈ సందర్భంగా పెద్ద సంఖ్యలో కార్యకర్తలు ప్రజలు అధినేతను చూడడానికి తరలివచ్చారు.
వారందరికీ అభివాదం చేస్తూ నేతలను పలకరిస్తూ కేసీఆర్ బస్సు యాత్ర ముందుకు సాగింది.
నర్సాపూర్ చేరుకున్న అనంతరం రోడ్డు షోలో కేసీఆర్ ప్రసంగించారు.
నర్సాపూర్ రోడ్ షో ముగిసిన తర్వాత కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుండిగల్ చౌరస్తాలో మల్కాజ్ గిరి ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మరెడ్డికి మద్దతుగా కేసీఆర్ రోడ్ షోకి హాజరయ్యారు.