In Pics: గవర్నర్‌ని కలిసిన పీవీ సింధు.. కెరీర్లో మరింతగా రాణించాలని తమిళిసై ఆకాంక్ష
టోక్యో ఒలింపిక్స్ 2020లో బ్యాడ్మింటన్ విభాగంలో కాంస్య పతకం సాధించిన క్రీడాకారిణి పీవీ సింధు.. తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌ను కలిశారు. ఈ మేరకు సింధు సహా ఆమె కోచ్, కుటుంబం రాజ్ భవన్‌కు వెళ్లింది.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఒలింపిక్స్‌లో కాంస్య పతకం గెలిచాక మర్యాదపూర్వకంగా పీవీ సింధు గవర్నర్‌ను కలిశారు. మెడల్ సాధించి దేశం గర్వపడేలా చేశారని సింధును గవర్నర్ ప్రశంసించారు. సింధు విజయం యువతకు స్ఫూర్తిదాయకమని గవర్నర్ కొనియాడారు.
వరుసగా రెండు ఒలింపిక్స్‌లో పతకాలు సాధించిన తొలి మహిళా క్రీడాకారిణిగా పీవీ సింధు చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా తన కాంస్య పతకాన్ని పీవీ సింధు గవర్నర్ తమిళిసైకి చూపించారు.
సింధు అంతర్జాతీయ స్థాయిలో మన దేశం పేరును నిలిపారని గవర్నర్ కొనియాడారు. సింధు తన కెరీర్లో మరింతగా రాణించాలని తమిళిసై ఆకాంక్షించారు.