Bonalu Festival Pics: తెలంగాణ బోనమెత్తిన గవర్నర్ తమిళిసై.. రాజ్‌భవన్‌లో బోనాల పండుగ
తెలంగాణ రాష్ట్ర పండుగ బోనాలను గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ వైభవంగా జరుపుకున్నారు. సోమవారం (ఆగస్టు 9న) ఆమె రాజ్ భవన్ ప్రాంగణంలోని అమ్మవారి గుడిలో సంప్రదాయబద్దంగా బోనం సమర్పించారు.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appతమిళిసై సౌందరరాజన్ స్వయంగా బోనం ఎత్తుకొని, తన అధికారిక నివాసం నుంచి అమ్మవారి గుడి వరకు నడుచుకుంటూ వచ్చి బోనం సమర్పించారు.
గవర్నర్ కుటుంబ సభ్యులు, రాజ్ భవన్ సిబ్బంది, రాజ్ భవన్ పరివార్‌కు చెందిన మహిళలు గవర్నర్‌తో పాటు అమ్మవారికి బోనం సమర్పించారు. భారతదేశం, తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, మరింతగా అభివృద్ధి చెందాలని అమ్మవారిని ప్రార్థించినట్లుగా ఈ సందర్భంగా డాక్టర్ తమిళిసై తెలిపారు.
తమిళిసై హైదరాబాద్ సంప్రదాయ పద్ధతిలో బోనాలను ఎత్తుకుని, జాతర తరహా మేళతాళాలతో గవర్నర్ తన నివాసం నుండి ఊరేగింపుగా వచ్చి అమ్మవారికి బోనం సమర్పించి, ప్రత్యేక పూజలు చేశారు.
గవర్నర్ స్వయంగా బోనం ఎత్తుకొని రావడం, సిబ్బంది ఊరేగింపుగా రావడంతో రాజ్ భవన్లో బోనాల పండుగ సంబరాలు వేడుకగా జరిగాయి. ఈ కార్యక్రమంలో గవర్నర్ సెక్రటరీ కే సురేంద్ర మోహన్, జాయింట్ సెక్రటరీలు భవానీ శంకర్, రఘు ప్రసాద్ ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.