In Pics: తెలంగాణలో రెండోరోజు జోడో యాత్ర, నేడు రాహుల్‌తో పాటు రేవంత్ కూడా
తెలంగాణలో రాహుల్ జోడో యాత్ర రెండవ రోజు నారాయణపేట జిల్లా మక్తల్ నియోజక వర్గంలో కొనసాగుతోంది.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appమక్తల్ సబ్ స్టేషన్ దగ్గర నుంచి పాదయాత్ర ఉదయం 6 గంటలకు ప్రారంభం అయింది.
ఇవాళ పాదయాత్ర 26.7 కిలోమీటర్ల పాటు కొనసాగనుంది.
నేడు బండ్ల గుంటలో లంచ్ బ్రేక్ ఇవ్వనున్నారు.
యలిగండ్ల శివారులో రాత్రి బస ఉంటుంది.
ఈ యాత్రలో రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కాంగ్రెస్ ప్రచార కమిటీ ఛైర్మన్ మధుయాష్కీ, ఏఐసీసీ కార్యదర్శులు పాల్గొన్నారు.
రాహుల్ గాంధీ పాదయాత్రలో భారత్ జోడో యాత్ర కల్చరల్ కమిటీ చైర్మన్, సీఎల్పీ నేత, భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో నాగరాజు కళాబృందం టేకులపల్లి పెట్రోల్ బంక్ వద్ద ఒగ్గుడోలు కళాకారులు ప్రదర్శన ఇచ్చారు.
టీ విరామం తర్వాత రాహుల్ గాంధీ ఒగ్గుడోలు కళాకారుల వద్దకు వచ్చి వారి ప్రదర్శనను ఆసక్తికరంగా తిలకించారు.
ఈ సందర్భంగా కళాకారులు పలు విన్యాసాలు చేసి చూపించారు.
గొల్ల కురుమ లకు సంబంధించిన ఈ కళాకారుల విశిష్టత గురించి రాహుల్ గాంధీ గారికి సీఎల్పీ నేత భట్టి విక్రమార్క గారు వివరించారు.
ఇవాళ రాహుల్ పాదయాత్ర మక్తల్.. కన్యకాపరమేశ్వరి దేవాలయం, పెద్ద చెరువు ట్యాంక్‌బండ్, దండు క్రాస్ రోడ్డుల మీదుగా కచ్వర్ గ్రామానికి చేరుకుంటుంది.