In Pics: లండన్ నుంచి దావోస్‌కు మంత్రి కేటీఆర్ - దిగ్గజ కంపెనీల ప్రతినిధులతో భేటీలు
నాలుగు రోజుల పాటు లండన్‌లో పలు ప్రముఖ కంపెనీలతో సమావేశాలు నిర్వహించిన అనంతరం మంత్రి కే.తారకరామారావు ఈరోజు లండన్ నుంచి బయలుదేరారు.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appలండన్ హీత్రో విమానాశ్రయం నుంచి మంత్రి కేటీఆర్ జ్యూరిక్ చేరుకుని, అక్కడి నుంచి రోడ్డు మార్గంలో దావోస్ కి ఈ రాత్రికి చేరుకుంటారు.
మూడు రోజుల పాటు జరిగే వరల్డ్ ఎకనామిక్ సమావేశాల్లో ప్రధాన సమావేశ మందిరంలో జరిగే పలు జరిగే చర్చల్లో పాల్గొంటారు.
తర్వాత 26వ తేదీన స్విట్జర్లాండ్‌లోని జ్యూరిచ్ నగరంలో పలు కంపెనీల ప్రతినిధులతో సమావేశమవుతారు.
లండన్ నుంచి వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ సమావేశాలకు బయల్దేరిన మంత్రి బృందానికి లండన్ లోని టీఆర్ఎస్ ఎన్ఆర్ఐ శాఖ కార్యకర్తలు, పెద్ద ఎత్తున ఎన్ఆర్ఐలు వీడ్కోలు పలికారు.
రేపటి నుంచి జరిగే వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమావేశాలలో మంత్రి కేటీఆర్ రామారావు ప్రపంచంలోని పలు ప్రతిష్టాత్మక కంపెనీలతో సమావేశమవుతారు.
స్టార్టప్ జిరోదా వ్యవస్థాపకుడు నిఖిల్ కామత్, మీషో విదిత్ ఆత్రేతో మంత్రి కేటీఆర్
యూకే ఎన్ఆర్ఐ టీఆర్ఎస్ వింగ్ సభ్యుడు అనిల్ తో కేటీఆర్
బ్రిటన్ కు చెందిన కమర్షియల్ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ అరైవల్ యూకే లిమిటెడ్ సంస్థ కర్మాగారంలో మంత్రి కేటీఆర్
బ్రిటన్ కు చెందిన కమర్షియల్ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ అరైవల్ యూకే లిమిటెడ్ సంస్థ కర్మాగారంలో మంత్రి కేటీఆర్