In Pics: తెలంగాణ బడ్జెట్‌కు మంత్రి హరీశ్ సన్నద్ధం, ఫిల్మ్ నగర్ ఆలయంలో పూజలు, ఇంటి బయట వీర తిలకం
సీఎం కేసీఆర్ ఆశీస్సులతో ఆర్థిక మంత్రి హోదాలో మూడోసారి అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నానని మంత్రి హరీష్ రావు అన్నారు.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appసోమవారం (మార్చి 7) బడ్జెట్ సమావేశానికి హాజరయ్యేందుకు కోకాపేటలోని ఆయన ఇంటి నుంచి ఘనంగా బయలుదేరారు.
ఆయన నివాసం వద్ద హరీష్ రావు విలేకరులతో మాట్లాడారు.
ప్రజలకు ఇచ్చిన హామీలకు అనుగుణంగా ఈ బడ్జెట్ ఉందని చెప్పారు.
అన్ని వర్గాలకు సమాన న్యాయం చేసేలా మానవీయ కోణంలో ఈ బడ్జెట్‌ను రూపొందించామని చెప్పారు.
అనంతరం ఫిలిం నగర్‌లోని దైవసన్నిదానంలో ప్రత్యేక పూజలు చేశారు.
శాసన సభలో మంత్రి హరీష్, శాసన మండలిలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు.
ఫిలిం నగర్ ఆలయంలో పూజల తర్వాత హరీష్ రావు అసెంబ్లీకి చేరుకున్నారు.
ఈ సందర్భంగా సభాపతి, కౌన్సిల్ ఛైర్మన్‌ను మంత్రి మర్యాదపూర్వకంగా కలిశారు.
వారికి బడ్జెట్ 2022-23 ప్రతులను అందించారు. మానవీయ కోణంలో ఈ బడ్జెట్‌ను రూపొందించామని చెప్పారు.