In Pics: వరద ప్రభావిత ప్రాంతాల్లో గవర్నర్ తమిళిసై, వర్షంలోనే బాధితుల వద్దకు - రాత్రంతా రైలులో ప్రయాణం
పినపాక నియోజకవర్గంలో ఈ రోజు అశ్వాపురం మండలంలోని పాములపల్లి, చింతిర్యాల, వరద ముంపు ప్రాంతాల్లో తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళసై పర్యటిస్తున్నారు.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appజూన్ 16 న రాత్రి 11.45 నిమిషాలకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో బయలుదేరి నేడు ఉదయం 5 గంటలకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు రైల్వేస్టేషన్ కు చేరుకున్నారు.
ఉదయం 5.10 కి ప్రత్యేక వాహనం ద్వారా రైల్వేస్టేషన్ నుండి బయలుదేరి 5.30 నిమిషాలకు అశ్వాపురం భారాజల కర్మాగారం గెస్ట్ హౌస్ కు చేరుకున్నారు.
8.30 కు బ్రేక్ ఫాస్ట్ ముగించుకొని, 9 గంటలకు అశ్వాపురం మండలలోని గోదావరి ముంపు గ్రామం పాములపెళ్లి చేరుకున్నారు.
9.30 గంటల వరకు పాములపెళ్లి ముంపుకు గురైన ప్రాంతాన్ని సందర్శించారు.
మళ్లీ 10 గంటలకు అశ్వాపురం ఎస్కేటీ ఫంక్షన్ హాల్ కు చేరుకొని పునరావాస కేంద్రంలో ఉన్న బాధితులతో మాట మంతి కార్యక్రమం నిర్వహించారు.
అనంతరం మందులు పంపిణీ కార్య క్రమంలో పాల్గొన్నారు.
మధ్యాహ్నం 12 గంటలకు అశ్వాపురంలోని చింతిర్యాల గ్రామం చేరుకుంటారు.
మధ్యాహ్నం 1 గంట వరకు చింతిర్యాల గ్రామ ప్రజలతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొంటారు.
ఒంటి గంటకు చింతిర్యాల గ్రామంలో బయలుదేరి 1.30 భారాజల కర్మగార కాలనీ తరంగిని పంక్షన్ హాల్ కు చేరుకుంటారు.
1.30 గంటల నుండి 2.30 వరకు ముంపు గ్రామాల ప్రజలతో మాట్లాడతారు.
2.30 గంటలకు తరంగిణి ఫంక్షన్ హాల్ నుండి బయలుదేరి 2.40 గంటలకు భారాజల కర్మగారం గెస్ట్ హౌస్ చేరుకుంటారు.
2.40 గంటల నుండి 3.20 గంటల వరకు మధ్యాహ్న భోజనం చేస్తారు.
3.20 గంటల నుండి 5.00 గంటల వరకు కేంద్ర హోంమంత్రితో వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొంటారు.
సాయంత్రం 5.00 గంటల నుండి రాత్రి 9.00 గంటల వరకు విశ్రాంతి తీసుకొని డిన్నర్ చేస్తారు. అనంతరం మణుగూరు రైల్వేస్టేషన్ కు బయలుదేరి అక్కడి నుంచి సికింద్రాబాద్కు రైలులో చేరుకుంటారు.