In Pics: వరద బాధితుల వద్దకు కేసీఆర్, గోదావరికి శాంతి పూజలు - నీళ్లలో నుంచే సీఎం కాన్వాయ్
వరద ముంపు ప్రాంతాల పర్యటనలో భాగంగా భద్రాచలంలో సీఎం కేసీఆర్ పర్యటించారు.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appగోదావరి నదిపై సీఎం కేసీఆర్ గంగమ్మ తల్లికి పూజలు చేశారు. తర్వాత కరకట్టను పరిశీలించారు.
సీఎం, భద్రాచలం జెడ్పీ హైస్కూల్లో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రానికి చేరుకున్నారు.
అక్కడ ముంపు బాధితులను సీఎం కేసీఆర్ పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితులు, యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు.
బాధితులకు అందుతున్న నిత్యావసర వస్తువుల, సౌకర్యాలు, వైద్యం, ఇతర సహాయం గురించి సీఎం ఆరా తీశారు. వారిని పేరుపేరునా పలకరించారు.
తమకు అన్నిరకాలుగా సహాయ, సహకారాలు అందుతున్నాయని, స్థానిక మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ప్రభుత్వ అధికారులు తమను కంటికి రెప్పలా కాపాడుతున్నారని సీఎంకు బాధితులు వివరించారు.
భద్రాచలం పర్యటన అనంతరం, భద్రాచలం నుండి ఏటూరు నాగారం దిశగా, ముఖ్యమంత్రి కేసీఆర్ హెలీకాప్టర్లో ఏరియల్ సర్వే నిర్వహించారు.
ఈ సందర్భంగా ప్రకృతి విపత్తుతో జలమయమై, ఉధృతంగా ప్రవహిస్తున్న గోదావరిని సీఎం పరిశీలించారు.
నదికి ఇరువైపులా నీటిలో చిక్కుకున్న గ్రామాల్లో వరదల పరిస్థితిని స్వయంగా పరిశీలిస్తూ, సీఎం ఏటూరునాగారం చేరుకున్నారు.
ఐటీడీఏ గెస్ట్ హౌజ్ లో లంచ్ చేశారు. అనంతరం, కరకట్ట వద్ద ఏర్పాటు చేసిన ముంపు బాధితుల పునరావాస కేంద్రానికి వెళ్లి, ముంపు బాధితులను సీఎం పరామర్శించారు.
అక్కడే, అధికారులు ఏర్పాటు చేసిన మారుమూల ప్రాంతాల్లో వరదల పరిస్థితిని ఫొటో ఎగ్జిబిషన్లో ముఖ్యమంత్రి పరిశీలిస్తారు.
వర్షాలను, వరదలను లెక్కచేయకుండా తమను పరామర్శించడానికి వచ్చిన సీఎం కేసీఆర్ ను చూసి భద్రాచలం వాసులు ఆశ్చర్యానికి లోనయ్యారు.
భద్రాచలంలో వరదలు వచ్చినపుడల్లా ప్రతిసారి ఇక్కడి ప్రజలు ముంపునకు గురికావడం బాధాకరమని సీఎం అన్నారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రెస్ మీట్ నిర్వహించారు.
ప్రగతి రథం బస్సులో సీఎం కేసీఆర్ పర్యటించారు.