Nizamabad News: కొత్తగా నిర్మించిన సీహెచ్ కొండూరు ఆలయంలో భక్తిశ్రద్దలతో క్షిరాధివాస వేడుక
నిజామాబాద్ జిల్లా నందిపేట్ మండలం సీహెచ్ కొండూరులో ఆలయ జీర్ణోద్ధరణలో భాగంగా శ్రీ రాజ్యలక్ష్మి సమేత నరసింహ స్వామి క్షేత్రంలో మూడోరోజు ఉదయం ప్రాతఃకాల ఆరాధన వేదవిన్నపాలతో మొదలైన కార్యక్రమాలు ఆధ్యాత్మికత ప్రవాహంలో భక్తులను ముంచెత్తుతున్నాయి.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appనిన్నటి రోజు జలాధివాసంలో ఉంచిన ప్రతిష్టాపనమూర్తులను ఇవాళ క్షీరాధివాసం చేశారు. పాంచరాత్ర ఆగమ శాస్త్ర నియమాల ప్రకారం దాదాపు ద్వాదశ లీటర్ల గోక్షీరాన్ని ఉపయోగించి ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. వేలాది భక్తులు భక్తిప్రపత్తులతో సమర్పించిన ఆవు పాలను క్షీరాధివాసంలో ఉపయోగించారు.
జలాధివాసం వలన ప్రతిష్టాపన విగ్రహాలలో శేష మాలిన్యాలు తొలగిపోయి జలంలోని మంత్రశక్తితో మూర్తులు దివ్యత్వాన్ని పొందాయని, ఈ క్షీరాధివాసం ప్రతిష్టాపన మూర్తులు ఇతర పరివార దేవతలకు ప్రాణప్రతిష్ఠ సమయంలో విశ్వంలోని శక్తిని ఆవాహన చేసేందుకు నిర్వహిస్తారు. ప్రాణప్రతిష్ట ద్వారా విగ్రహాలు అనంతమైన శక్తిని పొందుతాయని విశ్వాసం.
ఉదయం నుంచి జరిగిన కార్యక్రమాలలో నివేదన, మంగళాశాసనం, శాత్తుమోరె, ద్వారా తోరణ ధ్వజ కుంభారాధన, చతుస్థానార్చన, అగ్నిముఖం,, మంత్రహవనం, మృత్తికా విన్నపం, నయన ఉన్మీలనం పంచ సూక్త పరివార ప్రాయశ్చిత్త హవనం, మంగళాశాసనం తీర్థ ప్రసాదగోష్ఠితో ఆలయం పరవశించింది.
వేలాదిగా భక్తులు హాజరై ప్రతిష్ఠాపన ఉత్సవాలను తిలకించారు. ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్, జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి దంపతులు, శాసనమండలి సభ్యులు రఘోత్తమ రావు, పూల రవీందర్, జడ్పీ చైర్మన్ దాదన్నగారి విట్టల్ రావ్, ఆర్మూర్ శాసనసభ్యులు ఆశన్న గారి జీవన్ రెడ్డి తదితర ప్రముఖులు ఈ ఆలయాన్ని సందర్శించారు
ఇలాంటి విగ్రహరూపంలో ఉన్న దేవతలను దర్శించడం ద్వారా కోరిన కోరికలు నెరవేరుతాయని విశ్వాసం. ఆగమ శాస్త్రం ప్రకారం ఆలయాల ప్రాణప్రతిష్ఠ సమయంలో మూలమూర్తిని పవిత్రమైన పాలతో అభిషేకం చేయడాన్నే క్షీరాధివాసం అంటారు. క్షీరసాగర తరంగ శిఖర సార తరకిత చారుమూర్తే అంటూ సాగే ముకుందమాలలో క్షీరాధివాసం విశిష్టత చెప్పారు. ఈ క్షీరాధివాసం కార్యక్రమంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, డిఆర్ అనిల్ కుమార్, నవత రామ్ కిషన్ రావు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
నిజామాబాద్ జిల్లా నందిపేట్ మండలం సీహెచ్ కొండూరులో ఆలయ జీర్ణోద్ధరణలో భాగంగా శ్రీ రాజ్యలక్ష్మి సమేత నరసింహ స్వామి క్షేత్రంలో మూడోరోజు ఉదయం ప్రాతఃకాల ఆరాధన వేదవిన్నపాలతో మొదలైన కార్యక్రమాలు ఆధ్యాత్మికత ప్రవాహంలో భక్తులను ముంచెత్తుతున్నాయి.