Komatireddy Venkat Reddy: ఇండిపెండెన్స్ డే వేడుకల్లో ₹349 కోట్ల రుణాలు, మెప్మా చెక్కులు అందజేసిన మంత్రి కోమటిరెడ్డి
నల్గొండ: రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి 79వ భారత స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా శుక్రవారం నల్గొండ జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ మైదానంలో జాతీయ పతాకాన్ని ఎగరవేశారు. అనంతరం జిల్లా అభివృద్ధికి సంబంధించిన కార్యక్రమాలను తన సందేశం ద్వారా ప్రజలకు వివరించారు.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్వాతంత్ర సమరయోధులను సన్మానించారు. ఉత్తమ సేవలందించిన ఉద్యోగులకు ప్రశంస పత్రాలను అందజేశారు. ద్వారా స్త్రీ నిధి కింద ₹349 కోట్ల బ్యాంకు లింకేజీ రుణాలను మహిళా సంఘాలకు అందజేశారు. ఇందిరమ్మ గృహ లబ్ధిదారులకు ₹3.80 కోట్ల రుణాల చెక్కులను పంపిణీ చేశారు.
పరిశ్రమల శాఖ కింద టీ ప్రైడ్ ద్వారా నలుగురికి ₹1.48 కోట్ల చెక్కులు, మెప్మా కింద ₹12.98 కోట్ల బ్యాంకు లింకేజీ రుణాలను అందజేశారు. అలాగే శకటాల ప్రదర్శనను నిర్వహించారు.
ఇండిపెండెన్స్ డే సందర్భంగా వివిధ శాఖల అభివృద్ధిని ప్రతిబింబించేలా 12 స్టాల్స్ ఏర్పాటు చేశారు. పలు పాఠశాలల విద్యార్థులు అందించిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రజలను ఆకట్టుకున్నాయి.
ఇండిపెండెన్స్ డే వేడుకల్లో పాల్గొని పాడుతున్న విద్యార్థులు
కార్యక్రమంలో నల్గొండ ఎంపీ కుందూరు రఘువీర్ రెడ్డి, ఎమ్మెల్సీలు నెల్లికంటి సత్యం, శంకర్ నాయక్, మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్మారెడ్డి, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షులు ఎం.ఏ. ఆఫీజ్ ఖాన్, జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్, జిల్లా రెవిన్యూ అదనపు కలెక్టర్ జే. శ్రీనివాస్, అదనపు ఎస్పీ రమేష్, ఏసీపీ మౌనిక, జిల్లా సీనియర్ అధికారులు, మాజీ ప్రజాప్రతినిధులు ఇతరులు పాల్గొన్నారు.