Venkaiah Naidu: భారత్ బయోటెక్‌లో ఉప రాష్ట్రపతి.. వ్యాక్సిన్ తయారీ పరిశీలించిన వెంకయ్య నాయుడు
ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు శుక్రవారం హైదరాబాద్ జినోమ్ వ్యాలీలోని భారత్ బయోటెక్‌ను సందర్శించారు. షామీర్‌పేట్‌లోని జీనోమ్ వ్యాలీలో ఉన్న భారత్ బయోటెక్‌ను ఆయన సందర్శించారు.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appవ్యాక్సిన్ తయారయ్యే ప్రయోగశాలలో తయారీ పద్ధతిని నిపుణులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం భారత్ బయోటెక్ శాస్త్రవేత్తలతో సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో శాస్త్రవేత్తలనుద్దేశించి ఉప రాష్ట్రపతి ప్రసంగించారు. జినోమ్ వ్యాలీలో అనేక సంస్థలు కొలువుదీరాయని, హైదరాబాద్ బయో టెక్నాలజీ హబ్‌గా మారుతోందని కొనియాడారు. భారత్ బయోటెక్‌ను సందర్శించడం సంతోషంగా ఉందని అన్నారు.
‘‘భారత్ బయోటెక్ 16 రకాల వ్యాక్సిన్లు ఉత్పత్తి చేస్తోంది. ఇప్పటి వరకు నాలుగు బిలియన్ల టీకాలు పంపిణీ చేసింది. మన శాస్త్రవేత్తలు అనేక దేశాల ప్రజల ప్రాణాలు కాపాడుతున్నారు’’ అని వెంకయ్యనాయుడు అభినందించారు.
ఈ కార్యక్రమంలో భారత్ బయోటెక్ ఎండీ కృష్ణ ఎల్ల, జేఎండీ సుచిత్ర ఎల్ల తదితరులు పాల్గొన్నారు.
భారత్ బయోటెక్ ప్రాంగణంలో ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడుతో భారత్ బయోటెక్ ఎండీ కృష్ణ ఎల్ల, జేఎండీ సుచిత్ర ఎల్ల తదితరులు