KCR Delhi Tour: ఢిల్లీలో కేంద్ర జల్ శక్తి మంత్రితో సీఎం కేసీఆర్ భేటీ.. జల వివాదాలు, గెజిట్ వాయిదాపై చర్చ
తెలంగాణ సీఎం కేసీఆర్ మూడు రోజుల పర్యటనలో భాగంగా ఢిల్లీలో బిజీబిజీగా ఉన్నారు. శుక్రవారం తెలంగాణ అసెంబ్లీ సమావేశాలలో తొలిరోజు పాల్గొన్న కేసీఆర్.. అనంతరం బీఏసీ సమావేశంలో పాల్గొన్నారు. ఆ తరువాత హైదరాబాద్ నుంచి బయలుదేరి ఢిల్లీ చేరుకున్నారు.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appశుక్రవారం ఢిల్లీ వెళ్లిన తెలంగాణ సీఎం కేసీఆర్ శనివారం మధ్యాహ్నం కేంద్ర జల శక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షకావత్‌తో భేటీ అయ్యారు. తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న జలవివాదాల అంశంపై దాదాపు 40 నిమిషాల పాటు కేంద్ర మంత్రితో కేసీఆర్ చర్చించారు.
కేంద్ర జల శక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షకావత్‌తో తెలంగాణ సీఎం కేసీఆర్ భేటీ ముగిసింది. 5 అంశాలపై కేంద్ర మంత్రికి సీఎం కేసీఆర్ లేఖ రాశారు.
ఉమ్మడి ప్రాజెక్టులనే బోర్డుల పరిధిలో ఉంచాలని కేంద్ర మంత్రికి కేసీఆర్ విన్నవించారు. జల వివాదాలు, గెజిట్ నోటిఫికేషన్ అమలు అంశాలపై చర్చించారు. గెజిట్ వాయిదా వేయాలని సీఎం కేసీఆర్ కేంద్ర మంత్రిని మరోసారి కోరారు.
మూడు రోజుల ఢిల్లీ పర్యటనలో భాగంగా సెప్టెంబర్ 26న ఢిల్లీ విజ్ఞాన్‌భవన్‌లో కేంద్ర హోంమంత్రి అమిత్‌షా నిర్వహించే నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల ముఖ్యమంత్రుల సమావేశంలో తెలంగాణ సీఎం కేసీఆర్ పాల్గొననున్నారు. అనంతరం కేంద్ర ఆహార, పౌరసరఫరాలశాఖ మంత్రి పీయూష్ గోయల్‌తో కేసీఆర్ సమావేశం కానున్నారు.