Prof Jayashankar Birth Anniversary: ప్రొఫెసర్ జయశంకర్‌కు తెలంగాణ మంత్రుల ఘన నివాళులు
తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ జయంతి వేడుకలు (ఆగస్టు 6న) శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్నారు. సిద్ధిపేటలో మంత్రి హరీష్ రావు జయశంకర్ సార్‌కు ఘనంగా నివాళులు అర్పించారు.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appముస్తాబాద్ సర్కిల్లోని జయశంకర్ సార్ విగ్రహానికి మంత్రి హరీశ్ రావు పూల మాల వేసి నివాళులర్పించారు. తెలంగాణ సాధన కోసం జయశంకర్ సార్ చేసిన పోరాటం, త్యాగాలను ఆయన స్మరించుకున్నారు.
తెలంగాణ రాష్ట్ర సాధనే ఏకైక ఎజెండాగా తెలంగాణ భావజాల వ్యాప్తికి నిరంతరం కృషి చేసిన వ్యక్తి ప్రొఫెసర్ జయశంకర్. ప్రత్యేక రాష్ట్ర సాధనలో ఆయన చేసిన సూచనలు, సలహాలు భవిష్యత్ తరాలకు మార్గదర్శకాలుగా నిలుస్తాయని మంత్రి హరీష్ రావు ఆకాంక్షించారు.
ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం జయశంకర్ సర్ చేసిన నిరంతర కృషిని, త్యాగాలను తెలంగాణ సమాజం ఎప్పటికీ మరచిపోదని దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. నేడు జయశంకర్ సార్ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాల వేసి మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి నివాళులర్పించారు. సార్ ఆశయ సాధనకు సీఎం కేసీఆర్ నిరంతరం కృషి చేస్తున్నారని మంత్రి అన్నారు.
తెలంగాణ సిద్ధాంతకర్త ఫ్రొఫెసర్ జయశంకర్ సార్ చిత్రపటానికి మంత్రి జగదీశ్ రెడ్డి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ప్రత్యేక తెలంగాణ సాధనకు నిరంతరం శ్రమించిన మహనీయుడు జయశంకర్ అని ఆయన సేవల్ని స్మరించుకున్నారు.
తెలంగాణ సిద్ధాంతకర్త ఫ్రొఫెసర్ జయశంకర్ సార్ చిత్రపటానికి మంత్రి జగదీశ్ రెడ్డి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ప్రత్యేక తెలంగాణ సాధనకు నిరంతరం శ్రమించిన మహనీయుడు జయశంకర్ అని ఆయన సేవల్ని స్మరించుకున్నారు.
ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ జయంతి సందర్భంగా శాఖ ప్రధాన కార్యాలయం అరణ్య భవన్లో ఘనంగా నివాళులర్పించారు.
జయశంకర్ సార్ చిత్రపటానికి పూలమాల వేసి పిసిసిఎఫ్ ఆర్ శోభ, ఉన్నతాధికారులు, సిబ్బంది నివాళుర్పించి, ఆయన సేవల్ని స్మరించుకున్నారు.