Palamuru Ranga Reddy Project: పాలమూరు రంగారెడ్డి వెట్ రన్ ప్రారంభించిన కేసీఆర్, దక్షిణతెలంగాణ కల సాకారం
నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం నార్లాపూర్ వద్ద పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించి, జాతికి అంకితం చేశారు సీఎం కేసీఆర్.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఅనంతరం అంజనగిరి రిజర్వాయర్‌లోకి చేరిన కృష్ణమ్మ జలాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. జలహారతి పట్టారు.
సీఎం కేసీఆర్ నార్లాపూర్ పంప్‌హౌస్ వద్ద 145 మెగావాట్ల సామర్థ్యమున్న మోటర్లను ఆన్ చేసి, జలాల ఎత్తిపోతలను ప్రారంభించారు.
అతి పెద్ద మహా బలి మోటార్ ద్వారా శ్రీశైలం జలాశయం వెనుక జలాల నుంచి అప్రోచ్ కెనాల్ ద్వారా హెడ్ రెగ్యులేటరీ, ఇంటెక్ వెల్, సొరంగ మార్గాల ద్వారా సజ్జపూల్‌లోకి చేరిన కృష్ణా జలాలు….. మొదటి పంపు నుంచి డెలివరీ మెయిన్స్ ను దాటుకొని నార్లాపూర్ జలాశయానికి విజయవంతంగా చేరుతాయి.
3 పెద్ద ప్రాజెక్టులు.. గోదావరిపై 2 కాళేశ్వరం, ఖమ్మంలో సీతారామ ఎత్తిపోతల ప్రాజెక్టు.. పాలమూరులో పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టు పూర్తయితే దేశంలోనే తెలంగాణ వజ్రం తునకలాగ అందరికీ అన్నం పెట్టేలా మారుతుందన్నారు.
కేంద్రంలో 10 ఏళ్లుగా అధికారంలో ఉన్నారు. పైగా ప్రధాని నరేంద్ర మోదీ విశ్వగురువుగా గొప్పలు చెప్పుకుంటారు. మా అంత ఎవరు లేరని చెబుతారు. కానీ నీళ్ల వాటాను తేల్చాలని కృష్ణా ట్రిబ్యూనల్ కు లేఖ రాసేందుకు పదేళ్లు పడుతుందా? అని ప్రశ్నించారు.