In Pics: కొత్తకోట దయాకర్ రెడ్డి అంత్యక్రియల్లో పాల్గొని పాడె మోసిన చంద్రబాబు
ABP Desam
Updated at:
13 Jun 2023 06:51 PM (IST)
1
తెలంగాణకు చెందిన టీడీపీ సీనియర్ నేత కొత్తకోట దయాకర్‌రెడ్డి తుదిశ్వాస విడిచారు.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
కొంతకాలం నుంచి వయసురీత్యా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న దయాకర్ రెడ్డి హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు.
3
పరిస్థితి విషమించడంతో మంగళవారం తెల్లవారుజామున కన్నుమూశారు. దయాకర్ మరణం పట్ల పలు పార్టీలకు చెందిన కీలక నేతలు సంతాపం తెలిపారు.
4
మహబూబ్‌నగర్ జిల్లా చిన్నచింతకుంట మండలం పర్కాపురంలో దయాకర్ రెడ్డి అంత్యక్రియలు నిర్వహించారు.
5
టీడీపీ మాజీ ఎమ్మెల్యే కొత్తకోట దయాకర్ రెడ్డి భౌతిక కాయానికి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నివాళులర్పించారు.
6
దయాకర్ రెడ్డి స్వగ్రామానికి వెళ్లిన చంద్రబాబు మాజీ ఎమ్మెల్యే కుటుంబసభ్యులను ఓదార్చారు. దయాకర్ రెడ్డి అంత్యక్రియల్లో పాల్గొని పాడె మోశారు చంద్రబాబు.