IT Bonalu Photos: బోనమెత్తిన ఐటీ కారిడార్, టీహబ్ 2లో అట్టహాసంగా వేడుకలు
తెలంగాణ కల్చర్‌ను ప్రమోట్ చేసేందుకు తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్ (టిటా) ఐటీ బోనాలు నిర్వహించింది.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఈ సందర్భంగా టీ హబ్ 2.0 నుంచి సైబర్ టవర్స్ వద్ద చిన్న పెద్దమ్మ ఆలయం వరకు బోనం ఎత్తి ఓ ర్యాలీలా ఉద్యోగులు వెళ్లారు. బోనాల జాతరలో ఐటీ ఉద్యోగులు పాల్గొన్నారు.
తొట్టెలు, పోతరాజులు, బోనాల సందడితో ఐటీ కారిడార్‌లో కోలాహలం నెలకొంది.
తెలంగాణ రాష్ట్ర సంస్కృతి చాటేందుకు టీటా ఆధ్వర్యంలో 2013లో బోనాలు నిర్వహణ ప్రారంభించారు. ఆనాటి నుంచి వరుసగా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
తెలంగాణ బోనాల పండుగలో భాగమైన గోల్కొండ బోనాలు, సికింద్రాబాద్ బోనాల మధ్య ఆషాడ మాసంలోని ఆదివారం రోజున టీటా ఐటీ బోనాలు కార్యక్రమం నిర్వహిస్తుంది.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమం నాటి నుంచి టీటా బోనాలు నిర్వహిస్తోంది.
తెలంగాణ రాష్ట్రంలోకి మరిన్ని పెట్టుబడులు రావాలని ఆకాంక్షిస్తూ టీహబ్ 2 వద్ద 21 బోనాలతో పూజలు నిర్వహించారు.
అనంతరం భారీ ర్యాలీతో టీహబ్ 2 నుంచి సైబర్ టవర్స్ సమీపంలోని చిన పెద్దమ్మ తల్లి దేవాలయం వద్దకు ఊరేగింపులు, కోలాటాల మధ్య బోనాల సందడితో ఊరేగింపు చేశారు.
తెలంగాణ రాష్ట్ర ఛీఫ్ ఇన్నోవేషన్ ఆఫీసర్ శాంత తౌటం, టీహబ్ చైర్మన్ శ్రీనివాస్‌రావుతో పాటుగా చాలా మంది సాఫ్ట్వేర్ ఇంజినీర్లు హాజరయ్యారు.
ఈ సందర్భంగా టీటా గ్లోబల్ ప్రెసిడెంట్ సందీప్ మఖ్తల మాట్లాడుతూ, తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న తాము 2013 నుంచి టీటా ఐటీ బోనాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
భారీగా ఉద్యోగాల కల్పన జరగాలని గతంలో 21 బోనాలను టీటా సమర్పించి.... ఆ లక్ష్యాలు సఫలం కావడంతో మొక్కులు చెల్లించుకున్నామని గుర్తు చేసుకున్నారు.
ఈ సందర్భంగా అమ్మవారికి ఓడిబియ్యం, చీరను టీటా గ్లోబల్ ప్రెసిడెంట్ సందీప్‌కుమార్ మఖ్తల సమర్పించారు.