In Pics: గుర్రపు బండ్లపై అసెంబ్లీకి కాంగ్రెస్ నేతలు, గేటు ముందు నిరసన.. భారీగా ట్రాఫిక్ జామ్
రెండో రోజు కొనసాగుతున్న తెలంగాణ శాసనసభ వర్షాకాల సమావేశానికి కాంగ్రెస్ నేతలు గాంధీభవన్నుంచి గుర్రపు బండ్లపై అసెంబ్లీకి వెళ్లారు.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఅనంతరం అసెంబ్లీ గేటు ముందు కేంద్ర విధానాలపై నిరసన తెలిపారు.
దీంతో రోడ్డుపై బాగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. అసెంబ్లీకి చేరుకున్న కాంగ్రెస్ నేతల గుర్రపు బండ్లను పోలీసులు గేటు లోనికి అనుమతించబోమని తేల్చిచెప్పారు.
దీంతో వారు గేటు దగ్గరే ఆందోళనకు దిగారు. భట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు, సీతక్క తదితరులు గేటు వద్ద బైఠాయించి నిరసన తెలిపారు.
దీంతో కాంగ్రెస్ నేతలను పోలీసులు నారాయణ గూడ పోలీస్ స్టేషన్కు తరలించారు.
ఈ సందర్భంగా బీజేపీ, టీఆర్ఎస్ ఒక్కటేనని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆరోపించారు. కేంద్ర విధానాలపై రాష్ట్ర ప్రభుత్వ వైఖరి ఏంటో చెప్పాలని హస్తం ఎమ్మెల్యే సీతక్క డిమాండ్ చేశారు.