In Pics: హైదరాబాద్‌లో ఐపీఎస్ అధికారుల పాసింగ్ అవుట్ పరేడ్.. హాజరైన అజిత్ ధోవల్
హైదరాబాద్ నగరంలోని సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీలో దీక్షాంత్ సమారోహ్ జరిగింది. (Photo Credit: Facebook/SVPNA)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appవిజయవంతంగా శిక్షణ పూర్తిచేసుకున్న 73వ బ్యాచ్ ఐపీఎస్ అధికారుల పాసింగ్ అవుట్ పరేడ్ కార్యక్రమం జరిగింది. (Photo Credit: Facebook/SVPNA)
ఈ కార్యక్రమానికి జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. శిక్షణ పూర్తిచేసుకున్న ప్రొబేషనరీ ఐపీఎస్‌ల నుంచి దోవల్ గౌరవ వందనం స్వీకరించారు. (Photo Credit: Facebook/SVPNA)
ఈ పాసింగ్ అవుట్ పరేడ్‌కు వరుసగా మూడోసారి మహిళా అధికారిణి కమాండర్‌గా వ్యహరించారు.(Photo Credit: Facebook/SVPNA)
ట్రైనింగ్‌లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన దర్పణ్ అహ్లువాలియా పాసింగ్ అవుట్ కమాండర్‌గా వ్యహరించారు. (Photo Credit: Facebook/SVPNA)
ఎస్వీపీఎన్ఏలో మొత్తం 149 మంది శిక్షణ తీసుకున్నారు. ఇందులో 132 మంది ఐపీఎస్‌లు ఉండగా, 17 మంది ఫారెన్ ట్రైనీ ఆఫీసర్లు ఉన్నారు. (Photo Credit: Facebook/SVPNA)
ట్రైనింగ్ పూర్తిచేసుకున్నవారిలో 27 మంది మహిళా ఐపీఎస్‌లు ఉన్నారు. తెలంగాణకు నలుగురు, ఆంధ్రప్రదేశ్‌కు ఐదుగురు ట్రైనీ ఐపీఎస్‌లకు కేటాయించారు. (Photo Credit: Facebook/SVPNA)