CM Revanth Reddy: పెట్టుబడుల నగరంగా ఫ్యూచర్ సిటీ అభివృద్ధి: ఉగాది వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి
సంక్షేమం, అభివృద్ధి సమపాళ్లల్లో ఉండాలని.. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు అందరికీ లభించాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు. రాష్ట్ర ప్రజలకు విశ్వావసు నామ సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appరవీంద్రభారతిలో నిర్వహించిన ఉగాధి వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొని ప్రసంగించారు. భట్టి విక్రమార్క తెలంగాణ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్ 2025 ఈ ఉగాది పచ్చడిలా షడ్రుచుల సమ్మిళితం అన్నారు. తెలంగాణ రైజింగ్-2050 ప్రణాళికతో దేశానికే తెలంగాణను ఆదర్శంగా నిలబెడతాం అన్నారు.
విద్య, వైద్య, ఉద్యోగ, ఉపాధి, సంక్షేమం అన్నిటికీ బడ్జెట్ లో నిధులు కేటాయించడంతో పాటు వ్యవసాయ అభివృద్ధికి, పేదలకు విద్య అందిచేందుకు బడ్జెట్ లో ప్రాధాన్యం ఇచ్చినట్లు రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణను అభివృద్ధి పథంలో నడిపించేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు.
తెలంగాణ రైజింగ్ అంటూ దేశంలో తెలంగాణ ఒక వెలుగు వెలగాలి, దేశానికే ఆదర్శంగా నిలవాలని సీఎం రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు. దేశంలో కొత్త నగరాల నిర్మాణం జరగాలని.. అందులో భాగంగానే ఫ్యూచర్ సిటీ నిర్మాణానికి తెలంగాణ శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. ఫ్యూచర్ సిటీ పెట్టుబడుల నగరంగా అభివృద్ధి చెందుతుందని ధీమా వ్యక్తం చేశారు. ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ ను తీసుకొచ్చి దేశంలోనే పేదలకు ఆకలి దూరం చేసేందుకు ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. నేడు పేదలకు సన్నబియ్యం అందించే పథకానికి ఉగాది రోజున తాము శ్రీకారం చుడుతున్నట్లు తెలిపారు.
దేశంలోనే అత్యధికంగా వరి ఉత్పత్తి చేసిన రాష్ట్రాల్లో తెలంగాణ ముందుంజలో నిలిచిందని.. రైతులు పండించిన సన్న ధాన్యాన్ని పేదలకు అందించబోతున్నామని చెప్పారు. ఇది రాజకీయాలు చేసే సందర్భం కాదని.. ఆదాయం పెంచాలి, పేదలకు పెంచాలన్నది కాంగ్రెస్ ప్రభుత్వ విధానమని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. మంత్రి కొండా సురేఖ, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డిలతో కలిసి వెళ్లి గవర్నర్ కు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు.