In Pics: ఈటల రాజేందర్ అరెస్టు - అసెంబ్లీ ఎదుట నిరసన, వెంటనే పీఎస్‌కు తరలింపు
తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మొదలైన రోజే భారతీయ జనతా పార్టీకి భారీ షాక్ తగిలింది.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appబీజేపీ ఎమ్మెల్యేలు ఈటల రాజేందర్, రాజా సింగ్, రఘునందన్ రావు సస్పెండ్ అయ్యారు. బడ్జెట్ ప్రసంగానికి అడ్డు పడుతున్నారన్న కారణంగా ఈ ముగ్గురిని స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డి సస్పెండ్ చేశారు.
శాసనసభ సమావేశాలు ముగిసే వరకు ఈ ముగ్గురు సభ్యులను సస్పెండ్ చేస్తున్నట్లు స్పీకర్ పోచారం ప్రకటించారు.
ప్రతిపక్షాల గొంతు నొక్కడానికే తమను సస్పెండ్ చేశారని అసెంబ్లీ ఎదుట బైఠాయించి బీజేపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీ ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు.
దీంతో పోలీసులు ముగ్గురు ఎమ్మెల్యేలకు నచ్చచెప్పే ప్రయత్నం చేశారు.
గాంధీ విగ్రహం దగ్గరికి వెళ్లనివ్వకపోవడంతో గేటు ముందు బైఠాయించి నిరసన తెలిపారు.
ఈటల రాజేందర్‌ను పోలీసులు అరెస్టు చేసి బొలారం పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
ఈ సమావేశాల్లో తొలిసారి మరోపార్టీ నేతగా సీఎం కేసీఆర్‌ను ఎలా ఎదుర్కుంటారో చూద్దామని బీజేపీ నేతలతో పాటు హుజురాబాద్ ప్రజలు ఆసక్తిగా ఎదురుచూశారు.
కానీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మొదలైన రోజే బీజేపీ పార్టీ వ్యూహాలను అధికార పార్టీ టీఆర్ఎస్ ఛేదించినట్లు కనిపిస్తోంది.