T Hub Pics: టీ హబ్ 2.0 రెడీ, అబ్బురపరిచే నిర్మాణ శైలి! గాల్లోనే ఎక్కువ భాగం బిల్డింగ్ - ప్రారంభం ఎప్పుడంటే
దేశంలోనే ప్రతిష్ఠాత్మకమైన స్టార్టప్ ఇంక్యుబేటర్ టీ హబ్ 2.0 ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. ఇది ప్రపంచంలోనే అతి పెద్ద స్టార్టప్ ఇంక్యుబేటర్ గా ప్రభుత్వం చెబుతోంది. ఈ నెల 28న ముఖ్యమంత్రి కేసీఆర్ టీ హబ్ 2.0 భవనాన్ని ప్రారంభించనున్నారు.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appహైదరాబాద్‌లో టీ హబ్ 2.0 ను తెలంగాణ ప్రభుత్వం అత్యున్నత ప్రమాణాలతో, విశాలంగా, వినూత్నమైన నిర్మాణ శైలిలో చూడగానే ఆకట్టుకునేలా నిర్మించింది. రాయదుర్గం నాలెడ్జ్ సిటీలో సుమారు 5.82 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ప్రపంచంలోనే అతిపెద్ద ఆవిష్కరణల కేంద్రంగా దీన్ని రూపొందించారు.
తొలుత రాష్ట్ర ఆవిర్భావం తర్వాత 2015లో గచ్చిబౌలి ట్రిపుల్ ఐటీ క్యాంపస్‌లో టీ హబ్‌ను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.
28న టీ హబ్ 2.0 ప్రారంభం సందర్భంగా టీ హబ్ ఇన్నోవేషన్ సమ్మిట్ జరగనుంది. ఈ సదస్సులో దేశ విదేశాలకు చెందిన ఐటీ, స్టార్టప్ రంగ నిపుణులు, వెంచర్ క్యాపిటలిస్టులు, ప్రభుత్వ, ప్రైవేటు రంగాలకు చెందిన ప్రతినిధులు హాజరు కానున్నారు.