In Pics: హైదరాబాద్లో కన్నుల పండుగగా శ్రీవారి కల్యాణం - ఫోటోలు చూసి తరించండి
హైదరాబాద్ లోని ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహిస్తున్న శ్రీవేంకటేశ్వర వైభవోత్సవాల్లో చివరి రోజు శనివారం రాత్రి శ్రీనివాస కల్యాణం శాస్త్రోక్తంగా జరిగింది.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appహైదరాబాద్ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి కల్యాణాన్ని తిలకించారు. ఐదు రోజుల పాటు జరిగిన వైభవోత్సవాలు కల్యాణఘట్టంతో వైభవంగా ముగిశాయి.
ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, టిటిడి ధర్మకర్తల మండలి అధ్యక్షుడు వైవి.సుబ్బారెడ్డి దంపతులు, రాజ్యసభ సభ్యుడు కె.లక్ష్మణ్, ఈఓ ఎవి.ధర్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు
సాయంత్రం 6.30 గంటలకు వేద పండితులు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీవారి ఉత్సవర్లను కల్యాణవేదిక వద్దకు తీసుకొచ్చారు.
రాత్రి 7 నుండి 8.30 గంటల వరకు అర్చకుల వేదమంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాల నడుమ విష్వక్సేనారాధన, పుణ్యహవచనం, కంకణధారణ, అగ్నిప్రతిష్టాపన, యజమాని సంకల్పం, భక్త సంకల్పం, మధుపర్క సమర్పణ, మహాసంకల్పం, మంగళసూత్రధారణ ఘట్టాలతో శాస్త్రోక్తంగా కల్యాణాన్ని నిర్వహించారు.
చివరిగా నక్షత్రహారతి, మంగళహారతి కార్యక్రమంతో కల్యాణం దిగ్విజయంగా ముగిసింది.