In Pics: తెలంగాణ అవతరణ వేడుకల్లో సీఎం కేసీఆర్ - అమరవీరులకు నివాళులు, జాతీయ జెండా ఆవిష్కరణ
ప్రగతి భవన్ లో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appరాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కె. చంద్ర శేఖర్ రావు గారు జాతీయ పతాకాన్ని ఎగురవేశారు.
జాతీయ గీతం ఆలపించారు. అనంతరం మిఠాయిలు పంచారు
పబ్లిక్ గార్డెన్స్ లోనూ రాష్ట్ర ప్రభుత్వం అవతరణ దినోత్సవ వేడుకలను అధికారికంగా నిర్వహించింది.
ఈ వేడుకల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొన్నారు.
జాతీయ పతాకం ఆవిష్కరించారు.
జాతీయ గీతం ఆలపిస్తుండగా గౌరవ వందనం చేశారు.
అంతకుముందు తొలుత సీఎం కేసీఆర్ గన్ పార్క్ వద్దకు చేరుకున్నారు.
తెలంగాణ అమరవీరుల స్తూపానికి కూడా నివాళి అర్పించారు.
అనంతరం పబ్లిక్ గార్డెన్స్‌లోని వేడుకల్లో కేసీఆర్ ప్రసంగించారు.
దేశం చుక్కాని లేని నావ లాగా గాలివాటుకు కొట్టుకుపోతోందని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు.
image 12
స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు గడిచినా మన దేశంలో ఇంకా దారిద్ర్యం ఇందుకు ఉందని ప్రశ్నించారు.
మన దేశంలో సుసంపన్నమైన వనరులు ఉన్నాయని, కష్టం చేసే ప్రజలు ఉన్నారని అన్నారు.