In Pics: కేసీఆర్కు యశోదలో మెడికల్ టెస్టులు - యాంజియోగ్రామ్ పరీక్ష చేసిన డాక్టర్లు
ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. దీంతో వెంటనే ఆయన సోమాజిగూడ యశోద ఆస్పత్రికి (Yashoda Hospital) వెళ్లారు.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఅక్కడ ఆయనకు యాంజియోగ్రామ్, సిటీ స్కాన్ పరీక్షలు వంటి పరీక్షలు చేశారు.
సీఎం కేసీఆర్ (KCR) వ్యక్తిగత వైద్యుడు, యశోద హాస్పిటల్లో జనరల్ ఫిజీషియన్ అయిన డాక్టర్ ఎంవీ రావు (Doctor MV Rao) స్పందించారు. సీఎం కేసీఆర్ (KCR) రెండు రోజులుగా నీరసంగా ఉన్నారని, ఎడమ చేయి లాగుతున్నట్లుగా చెప్పారని అన్నారు.
ముఖ్యమంత్రి ఆస్పత్రికి చేరుకున్న కాసేపటికి వైద్యులు యాంజియోగ్రామ్ పరీక్షను పూర్తి చేశారు.
రిపోర్టులు పరీక్షించిన డాక్టర్లు గుండె లోపల ఎలాంటి బ్లాక్స్ లేవని తెలిపారు. యాంజియోగ్రామ్ పరీక్ష నివేదిక పూర్తి నార్మల్గానే ఉందని వెల్లడించారు. గుండె సంబంధిత సమస్యలు ఏమీ లేవని ప్రకటించారు.
యశోద హాస్పిటల్కు వచ్చిన సీఎం కేసీఆర్తో పాటు ఆయన సతీమణి శోభ, కుమార్తె కవిత, మనవడు హిమన్షు రావు, ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్, భద్రతా సిబ్బంది ఉన్నారు.
మంత్రి కేటీఆర్ సహా ఆయన ఫ్యామిలీ కూడా వెంటనే యశోద ఆస్పత్రికి చేరుకున్నారు.
ముందస్తుగా రొటీన్ పరీక్షలు కూడా మరికొన్నింటిని చేస్తున్నట్లుగా యశోద వైద్యులు తెలిపారు. శుక్రవారం మధ్యాహ్నం దాటే వరకూ కేసీఆర్ను అక్కడే ఉంచనున్నట్లు డాక్టర్లు తెలిపారు. అవసరమైతే హాస్పిటల్లోనే అడ్మిట్ చేసుకుంటామని చెప్పారు.