In Pics: కొండాపూర్‌లో 100 పడకల కొత్త ఫ్లోర్.. ప్రారంభించిన మంత్రి హరీశ్
కొండాపూర్ జిల్లా ఆసుపత్రిలో 100 పడకల నూతన అంతస్తును ప్రారంభించిన మంత్రి హరీష్ రావు
Download ABP Live App and Watch All Latest Videos
View In Appకరోనా సమయంలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో పడకల డిమాండ్ ఎక్కువ ఉన్నందున ముందుకు వచ్చిన రహేజా కార్ప్ సంస్థ
కోవిడ్ సమయంలో హైదరాబాద్‌లో 1300 పడకలను అదనంగా సీఎస్ఐఆర్లో భాగంగా వివిధ సంస్థలు ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఏర్పాటు
హరీశ్ రావు మాట్లాడుతూ.. ‘‘33 జిల్లాల్లో 6 వేల పడకలతో చిన్న పిల్లల కోసం పీడియాట్రిక్ విభాగాలు అందుబాటులోకి తెచ్చాం. ప్రభుత్వం మూడో వేవ్‌ను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉంది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో 27 వేల పడకలు సిద్ధంగా ఉన్నాయి.
రూ.154 కోట్లతో 900లకు పైగా ఐసీయూ బెడ్స్ త్వరలో అందుబాటులోకి వస్తాయి. డయాలసిస్ యూనిట్ల పెంపునకు కృషి చేస్తున్నాం. కొండాపూర్‌లో అతి త్వరలో ఒక డయాలసిస్ యూనిట్ ఏర్పాటు చేస్తాం.
వ్యాక్సినేషన్ 100% జరగాలంటే ప్రజా ప్రతినిధులు సహా ప్రతి ఒక్కరి భాగస్వామ్యం అవసరం. 3.96 లక్షల వ్యాక్సిన్ డోస్ లు పంపిణీ చేశాం. రోజు సుమారు 3.5 నుంచి 4 లక్షల మందికి వ్యాక్సిన్లు ఇస్తున్నాం.
మైండ్ స్పేస్ సీఈఓ కి అభినందనలు. ఆస్పత్రి నిర్వహణ కూడా మైండ్ స్పేస్ తీసుకోవాలని కోరుతున్నాం’’ అని హరీశ్ రావు అన్నారు.