In Pics: కేటీఆర్ చేతినిండా రాఖీలే, ఈసారి ఎవరు కట్టారో తెలుసా?
విద్య, వైద్యం అవసరాల కోసం కేటీఆర్ అనేక మందిని ఆదుకున్నారు. అందులో కొంతమంది ఈరోజు రాఖీ పండుగను పురస్కరించుకొని ప్రత్యేకంగా బంజారా హిల్స్ లోని నంది నగర్ లో కేటీఆర్ ఇంటికి వచ్చి మరీ రాఖీ కట్టి తమ ప్రేమను చాటుకున్నారు.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appజగిత్యాలకు చెందిన అనాథ విద్యార్థిని రుద్రరచన చదువులో రాణించి ఇంజనీరింగ్ సీటు సాధించింది. అయితే ఆమె ఫీజులతో పాటు ఇతర అవసరాల కోసం ఆర్థిక ఇబ్బందులు పడుతున్న విషయం తెలుసుకున్న కేటీఆర్ తన వ్యక్తిగత హోదాలో ఆమె విద్యకు అవసరమైన పూర్తి ఖర్చులను భరించారు. ప్రస్తుతం రుద్రరచన తన చదువు పూర్తి చేసుకుని కాగ్నిజెంట్ కంపెనీలో ఉద్యోగాన్ని చేస్తుంది.
కేటీఆర్ చేసిన సహాయానికి కృతజ్ఞతగా గత ఏడాది ఆమె తన మూడు నెలల జీతాన్ని ముఖ్యమంత్రి సహాయనిధికి అనాధ విద్యార్థులను ఆదుకోవడం కోసం విరాళం ఇచ్చింది. ఈసారి కూడా రుద్ర రచన కేటీఆర్ ని కలిసి రాఖీ కట్టి తన ప్రేమను చాటుకుంది.
హైదరాబాద్ జూబ్లీహిల్స్ నియోజకవర్గం బోరబండ కి చెందిన ఐదు సంవత్సరాల జోహాన్ ఖాన్ పుట్టుకతోనే వినికిడి సమస్యతో బాధపడుతున్న విషయం సామాజిక మాధ్యమాల ద్వారా తెలుసుకున్న కేటీఆర్ ఆయనకి వినికిడి చికిత్సకు అవసరమైన సహాయాన్ని అందించారు.
ఐదు సంవత్సరాలుగా అనేక రకాలుగా ఇబ్బంది పడిన జోహాన్ ప్రస్తుతం అందరి పిల్లలు లాగానే వినడంతో పాటు మాట్లాడడం చేస్తున్నారు. తన కొడుకుకు భవిష్యత్తును అందించిన జోహాన్ ఖాన్ కుటుంబం కేటీఆర్ ని తమ ఇంటికి ఆహ్వానించి గతంలో కృతజ్ఞతలు తెలియజేశారు. ఈరోజు జోహాన్ ఖాన్ తల్లి కేటీఆర్ నివాసానికి వచ్చి రాఖీ కట్టి తన ప్రేమను చాటుకున్నారు
హైదరాబాద్ నగరానికి చెందిన ఐదు సంవత్సరాల కృతిక అనే బాలిక వీధి కుక్కల దాడిలో తీవ్రంగా గాయపడితే కేటీఆర్ ఆమె ఆపరేషన్లకు అవసరమైన సహాయాన్ని అందించారు. చిన్నారి కృతిక ఈరోజు కేటీఆర్ ఇంటికి వచ్చి రాఖీ కట్టి ధన్యవాదాలు తెలిపారు. కేటీఆర్ అందించిన సహాయానికి కృతిక కుటుంబం కేటీఆర్ కి కృతజ్ఞతలు తెలియజేసింది