KCR Participates Candle Rally: గన్ పార్క్ వద్ద అమరవీరులకు కేసీఆర్ ఘన నివాళి, తెలంగాణ దశాబ్ది ఉత్సవాలకు శ్రీకారం
తెలంగాణ అవతరణ ఉత్సవాల సందర్భంగా రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అమరవీరుల స్థూపానికి పుష్పాంజలి ఘటించారు.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appబీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, నేతలు హైదరాబాద్‌లోని అమరవీరుల స్థూపం గన్ పార్క్ వద్ద క్యాండిల్ ర్యాలీలో పాల్గొన్నారు. రాష్ట్ర అవతరణ దినోత్సవం వేడుకలలో భాగంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ క్యాండిల్ ర్యాలీలో పాల్గొన్నారు.
అనంతరం అమరవీరుల స్థూపానికి కేసీఆర్ పుష్పాంజలి ఘటించారు. ఉద్యమ నేత కేసీఆర్ కొవ్వొత్తితో జ్యోతిని వెలిగించి ఘన నివాళి అర్పించారు.
తెలంగాణ అమరవీరులకు నివాళులు అర్పిస్తూ.. గన్‌పార్క్ అమరవీరుల స్థూపం నుంచి ట్యాంక్ బండ్ అమరజ్యోతి వరకు కొవ్వొత్తులతో భారీ ర్యాలీ నిర్వహించి అమరవీరులను స్మరించుకున్నారు.
తెలంగాణ స్వరాష్ట్రమై పదేండ్లు పూర్తిచేసుకున్న సందర్భంలో రాష్ట్ర సాధన కోసం సాగిన పోరాటాలు త్యాగాలను KCR స్మరించుకున్నారు.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావుతో పాటు పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు భారీ ఎత్తున క్యాండిల్ ర్యాలీ కార్యక్రమంలో పాల్గొన్నారు.
జై తెలంగాణ, జై కేసీఆర్ అని బీఆర్ఎస్ శ్రేణులు నినాదాలు చేశాయి. రాష్ట్ర సాధనలో తమ ప్రాణాలు అర్పించిన అమరుల వీరుల త్యాగాలను ఈ సందర్భంగా కేసీఆర్, బీఆర్ఎస్ నేతలు స్మరించుకున్నారు.