Ramadan 2022 Photos: హైదరాబాద్‌లో ఘనంగా రంజాన్ వేడుకలు - మక్కా మసీదులో ప్రత్యేక ప్రార్థనలు
కరోనా వ్యాప్తి కారణంగా రెండు సంవత్సరాల నుంచి ఇంటి వద్దనే రంజాన్ వేడుకలు జరుపుకున్న ముస్లింలు ఈ ఏడాది మసీదులు, దర్గాలు, ఈద్గాలకు భారీగా తరలి వస్తున్నారు.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appరంజాన్ మాసం (Ramzan 2022) ఉపవాస దీక్షలు సోమవారం రాత్రితో ముగిశాయి. నిన్న రాత్రి 8 గంటలకు ఆకాశంలో నెలవంక కనిపించింది.
నెలవంక కనిపించడంతో నేడు పవిత్ర రంజాన్ (ఈద్ ఉల్ ఫితర్) వేడుకలు హైదరాబాద్‌తో పాటు తెలంగాణలో ఘనంగా జరుగుతున్నాయి.
రంజాన్ వేడుకల సందర్భంగా హైదరాబాద్ నగరంలో ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశారు.
మక్కా మసీదు, పాత బస్తీలోని చౌక్ మసీదు, అఫ్జల్‌గంజ్ జామా మసీదు, వజర్ ఆలీ మసీదు, సిద్ది అంబర్ బజార్, మీరాలం ఈద్గా, మసీదులకు ముస్లిం సోదరులు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు.
మక్కా మసీదు, చార్మినార్, మీరాలం ఈద్గాతో పాటు తెలంగాణలోని అన్ని మసీదులు, ఈద్గాల్లో ముస్లింలు సామూహిక ప్రార్థనలు నిర్వహించారు.
రంజాన్ పవిత్ర ప్రార్థనలు కొనసాగుతున్న నేపథ్యంలో హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.
రంజాన్ వేడుకలు మంగళవారం జరుపుకోవాలని రుయాత్ ఏ హిలాల్ కమిటీ ప్రతినిధి కుబుల్ పాషా సుత్తారి సోమవారం రాత్రి సూచించారు.
రంజాన్ సందర్భంగా చార్మినార్, మక్కా మసీదు వద్ద ప్రత్యేక ప్రార్థనలు
కరోనా తగ్గుముఖం పట్టడంతో ముస్లిం సోదరులు భారీ సంఖ్యలో మసీదులు, ఈద్గాలు, దర్గాలను దర్శించుకుంటున్నారు.
రంజాన్ సందర్భంగా చార్మినార్, మక్కా మసీదు వద్ద ప్రత్యేక ప్రార్థనలు
రంజాన్ సందర్భంగా చార్మినార్, మక్కా మసీదు వద్ద ప్రత్యేక ప్రార్థనలు
రంజాన్ సందర్భంగా చార్మినార్, మక్కా మసీదు వద్ద ప్రత్యేక ప్రార్థనలు