Simhachalam Chandanotsavam: ఘనంగా అప్పన్న చందనోత్సవం, నిజరూప దర్శనం కోసం పోటెత్తుతున్న వీవీఐపీలు
విశాఖ జిల్లా సింహాద్రి అప్పన్న చందనోత్సవం వైభవంగా ప్రారంభమైంది.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appవైశాఖ శుద్ధ తదియ (అక్షయ తృతీయ)ను పురస్కరించుకుని మంగళవారం తెల్లవారుజామున (మే 3న) 4 గంటల నుంచి శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి దివ్యరూపాన్ని భక్తులు దర్శించుకుని తరిస్తున్నారు.
మంగళవారం వేకువజాము నుంచి చందనోత్సవ వైదిక కార్యక్రమాలను ఆలయ అర్చకులు ప్రారంభించారు. సుప్రభాత సేవ అనంతరం వెండి బొరుగుతో స్వామిపై ఉన్న చందనాన్ని ఒలిచారు.
తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అంతరాలయంలో స్వామివారిని దర్శించుకున్నారు. సింహాద్రి అప్పన్న నిజరూప దర్శనం లభించడం మహాభాగ్యం అన్నారు.
మంత్రులు గుడివాడ అమర్ నాథ్, చెల్లుబోయిన వేణు, కొట్టు సత్యనారాయణ, స్పీకర్ తమ్మినేని సీతారాం, మాజీ మంత్రులు వెల్లంపల్లి శ్రీనివాస్,అవంతి శ్రీనివాస్, ఎమ్మెల్సీ మాధవ్ తదితరులు స్వామివారి దర్శనం చేసుకున్నారు.
ఆలయ అనువంశిక ధర్మకర్త అశోక్ గజపతిరాజు స్వామివారి తొలి దర్శనం చేసుకుని, స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు.
ఆరాధన కార్యక్రమం నిర్వహించి తొలి దర్శనాన్ని దేవస్థానం అనువంశిక ధర్మకర్త పూసపాటి అశోక్ గజపతిరాజుకు అందించారు. తదుపరి ఇతర ప్రముఖులకు దర్శనం అనంతరం తెల్లవారుజామున 3 గంటల నుంచి భక్తులనుదర్శనాలకు అనుమతించారు.
రాత్రి 9 గంటల నుంచి సహస్ర ఘటాభిషేకాన్ని నిర్వహిస్తారు. గంగధార నుంచి 1008 కలశాలతో నీటిని తీసుకొచ్చి శ్రీ వైష్ణవస్వాములు నృసింహస్వామి వారి నిజరూపాన్ని అభిషేకిస్తారు. అనంతరం అర్చకులు తొలివిడత చందనాన్ని సమర్పిస్తారు.
స్వామివారి నిజరూప దర్శనం కోసం భక్తులు భారీ సంఖ్యలో వేకువజాము నుంచే అప్పన్న ఆలయానికి పోటెత్తుతున్నారు.
ఉచిత దర్శనం : తెల్లవారుజాము 4 గంటల నుంచి
ప్రొటోకాల్ వీవీఐపీల దర్శనాలు ఉదయం 5 నుంచి 6గంటల వరకు, 8 గంటల నుంచి 9 గంటల వరకు కల్పించారు
వీఐపీల దర్శనాలు ఉదయం 6 గంటల నుంచి 7.30 గంటల వరకు, ఉదయం 10 గంటల నుంచి 12.30 గంటల వరకు, సాయంత్రం 2 గంటల నుంచి 3 గంటల వరకు భక్తులకు దర్శనం చేసే అవకాశం కల్పించారు.
image 13