In Pics: రెండు రాష్ట్రాలు నాకు రెండు కళ్లు - సీఎం అయ్యాక హైదరాబాద్ ఎన్టీఆర్ భవన్‌కు తొలిసారి చంద్రబాబు
హైదరాబాద్ లోని ఎన్టీఆర్ భవన్ కు చాలా రోజుల తర్వాత టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వచ్చారు.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఆయనకు తెలంగాణ టీడీపీ నేతలు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. అనంతరం కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించిన సీఎం చంద్రబాబు ప్రసంగించారు.
ముఖ్యమంత్రిగా నాలుగోసారి బాధ్యతలు తీసుకున్న తర్వాత హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ భవన్‌కు చంద్రబాబు రావడం ఇదే తొలిసారి.
ఢిల్లీ పర్యటన ముగిసిన వెంటనే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు రెండు రోజులు పాటు హైదరాబాద్ పర్యటిస్తున్నారు. అందులో భాగంగా తొలిరోజు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కలిసి విభజన అంశాలపై చర్చించారు.
దీంతో టీటీడీపీ ఆధ్వర్యంలో జూబ్లీహిల్స్‌లోని చంద్రబాబు నివాసం నుంచి భారీ ర్యాలీగా చంద్రబాబు ఎన్టీఆర్ భవన్ కు వచ్చారు.
దారి పొడవునా జై తెలుగుదేశం, జై చంద్రబాబు నినాదాలతో కార్యకర్తలు హడావుడి చేశారు.
కార్యకర్తలు, అభిమానుల కేరింతల నడుమ ఎన్టీఆర్ భవన్‌కు సీఎం చేరుకున్నారు. ఈ క్రమంలో మహిళలు బతుకమ్మలతో ఎన్టీఆర్ భవన్ కు వచ్చారు. పలువురు కళాకారులు మెప్పించారు.
ఆషాఢ మాసం ప్రారంభం కావడంతో బోనాలతో ర్యాలీలో పాల్గొన్నారు. ఈ ర్యాలీలో చంద్రబాబు, ఎన్టీఆర్, టీడీపీ అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
చంద్రబాబుకు తెలంగాణ టీడీపీ నేతలు సన్మానం చేశారు. అనంతరం చంద్రబాబు కార్యకర్తలు, నేతలను ఉద్దేశించి మాట్లాడారు.
తనకు ఏపీ, తెలంగాణ రెండు కళ్లని చంద్రబాబు అన్నారు. ఏపీలో తన విజయానికి తెలంగాణ నేతలు పరోక్షంగా కృషి చేశారని.. వారికి ధన్యవాదాలు అని చంద్రబాబు అన్నారు.
తెలంగాణలో అధికారంలో లేకున్నా నాయకులు పార్టీని వదిలివెళ్లారే తప్ప కార్యకర్తలు, అభిమానులు పార్టీని వదల్లేదని చంద్రబాబు అన్నారు.
తనను జైల్లో ఉంచినప్పుడు టీడీపీ శ్రేణులు చూపిన చొరవ ఎప్పటికీ మరువలేనని అన్నారు. చాలా దేశాల్లోనూ తన అరెస్టుకు వ్యతిరేకంగా నిరసనలు చేపట్టారని.. అదే సమయంలో గచ్చిబౌలిలో నిర్వహించిన సభను మరిచిపోలేనని అన్నారు.
ఏపీ తెలంగాణ రాష్ట్రాల మధ్య వివాదం ఉంటే నష్టాలే ఎక్కువని అన్నారు. ఇచ్చిపుచ్చుకునే ధోరణితో ఉంటేనే సమస్యలు పరిష్కారం అవుతాయని చంద్రబాబు అన్నారు.
తెలుగుజాతి ప్రయోజనాల కోసం కలిసి పని చేస్తామని స్పష్టం చేశారు. ఏపీలో వైసీపీ విధ్వంస పాలనతో చాలా నష్టం జరిగిందని చంద్రబాబు గుర్తు చేశారు.
తెలంగాణ గడ్డపై టీడీపీకి పునర్ వైభవం వస్తుందని చంద్రబాబు ఆశాభావం వ్యక్తం చేశారు.
ఎన్టీఆర్ భవన్ లో టీడీపీ శ్రేణుల ఉత్సాహం