Kalki 2898 AD Arjun Das: కల్కి 2898 ADలో కృష్ణుడికి గొంతిచ్చిన అర్జున్ దాస్ గురించి ఈ విషయాలు తెలుసా!
కల్కి 2898 AD మూవీలో ఫేస్ కనిపించని కృష్ణుడికి వాయిస్ ఇచ్చింది ఎవరో కాదు..లోకేష్ కనగరాజ్ మూవీస్ ఖైదీ, విక్రమ్ లో నటించిన అర్జున్ దాస్. బుట్టబొమ్మ మూవీలోనూ నటించాడు అర్జున్ దాస్. కృష్ణుడుకి డబ్బింగ్ చెప్పే అవకాశం రావడంతో అర్జున్ దాస్ తన ఉద్వేగాన్ని ట్విట్టర్ ఎక్స్ వేదికగా పోస్ట్ చేశాడు
అర్జున్ దాస్ వాయిస్ కి ఓ స్పెషల్ ఫాలోయింగ్ ఉంది..ఓజీ మూవీ టీజర్ కు వాయిస్ ఇవ్వడంతో మరింత పాపులర్ అయ్యాడు. ఇప్పుడు కల్కి 2898 AD మూవీలో కృష్ణుడికి వాయిస్ ఇచ్చాడు. దీనిపై స్పందించిన అర్జున్ దాస్.. అమితాబ్ బచ్చన్ ఎదురుగా ఉన్న శ్రీకృష్ణుడికి డబ్బింగ్ చెప్పాలని స్వప్న దత్ కాల్ చేసినప్పుడు చాలా టెన్షన్ పడ్డానన్నాడు.
చిన్నప్పటి నుంచి తన అభిమాన హీరో అమితాబ్ ను ఉద్దేశించి డైలాగ్స్ చెప్పడం చాలా మంచి అనుభూతినిచ్చిందన్నాడు. జీవితకాలంలో నువ్వేం సాధించావని ఎవరైనా అడిగితే అమితాబ్ తో మాట్లాడాను అని చెబుతానన్నాడు.
కల్కి 2898 AD తెలుగు, హిందీ వెర్షన్లకు డబ్బింగ్ చెప్పాడు. నటుడిగానే కాదు..డబ్బింగ్ ఆర్టిర్ట్ గానూ స్పెషల్ ఫాలోయింగ్ సంపాదించుకుంటున్నాడు అర్జున్ దాస్.
అర్జున్ దాస్ (Image Credit: Arjun das / Instagram)
అర్జున్ దాస్ (Image Credit: Arjun das / Instagram)